చికెన్ ప్యాక్డ్ ఎగ్స్
ABN , First Publish Date - 2016-06-14T18:35:29+05:30 IST
హాఫ్ బాయిల్డ్ గుడ్లు- 4, సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్‌తో నూనెలో కొద్దిగా ఉడికించిన చికెన్ ముక్కలు- 1 కప్పు, నూనె- వేగించడానికి సరిపడా, ఉప్పు- రుచికి సరిపడా, గసగసాల పేస్టు- 1/2 టీ స్పూను,
కావలసిన పదార్థాలు: హాఫ్ బాయిల్డ్ గుడ్లు- 4, సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్‌తో నూనెలో కొద్దిగా ఉడికించిన చికెన్ ముక్కలు- 1 కప్పు, నూనె- వేగించడానికి సరిపడా, ఉప్పు- రుచికి సరిపడా, గసగసాల పేస్టు- 1/2 టీ స్పూను, కారం- రుచికి సరిపడా, ఉల్లి తరుగు- 1/4 కప్పు, పచ్చిమిర్చి- 3, మైదా, కార్న్ ఫ్లోర్, టమోట ప్యూరీ, కొత్తిమీర తరుగు- ఒక్కోటీ 1 టీ స్పూను చొప్పున
తయారీ విధానం: గుడ్లు, నూనె తప్ప మిగతా వాటన్నింటినీ బాగా కలిపి, మిక్సీలో వేసి ముద్ద చేసుకోవాలి. తరువాత ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని మధ్యలో గుడ్డు ఉంచి, చుట్టూ కవర్ చేసి వాటిని ఇడ్లీ ప్లేటులో పెట్టి ఆవిరి మీద పావుగంట సేపు సన్నని సెగపై ఉడికించాలి. తరువాత వాటిని ఆరబెట్టి, నూనెలో దోరగా వేగించి తీయాలి.