మునక్కాయ సూప్‌

ABN , First Publish Date - 2015-09-02T22:24:58+05:30 IST

కావలసిన పదార్థాలు: మునగ కాయలు - 2 అంగుళాల ముక్కలు 12, వెల్లుల్లి రెబ్బలు - 5, జీలకర్ర - 1 టీ స్పూను

మునక్కాయ సూప్‌

కావలసిన పదార్థాలు: మునగ కాయలు - 2 అంగుళాల ముక్కలు 12, వెల్లుల్లి రెబ్బలు - 5, జీలకర్ర - 1 టీ స్పూను, మిరియాలు - అర టీ స్పూను, చిన్న ఉల్లిపాయలు - 4, కరివేపాకు 4 రెబ్బలు, ఉప్పు - రుచికి తగినంత, నూనె - 1 టీ స్పూను.
తయారుచేసే విధానం: కప్పు నీటిలో మునగ ముక్కలు ఉడికించాలి. చల్లారిన తర్వాత స్పూను లేదా చాకుతో గుజ్జును లాగి గ్రైండ్‌ చేసుకోవాలి. నూనెలో జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లి, ఉల్లి తరుగు వేగించి మునగ గుజ్జు కలపాలి. తర్వాత ఉప్పు, కరివేపాకుతో పాటు 4 కప్పుల నీరు పోసి కొద్దిగా చిక్కబడ్డాక దించేయాలి. ‘ఎ’ విటమిన్‌ పుష్కలంగా ఉండే ఈ మునగ సూప్‌ ఆరోగ్యానికి ఎంతో మంచిది.

Updated Date - 2015-09-02T22:24:58+05:30 IST