అరటితోబ్రెడ్ కేక్
ABN , First Publish Date - 2015-08-29T22:03:19+05:30 IST
కావలసిన పదార్థాలు: (బాగా పండిన) అరటి పండ్లు - 4, బటర్ - 100 గ్రా., గిలకొట్టిన గుడ్డు - 1

కావలసిన పదార్థాలు: (బాగా పండిన) అరటి పండ్లు - 4, బటర్ - 100 గ్రా., గిలకొట్టిన గుడ్డు - 1, పంచదార - 140 గ్రా., మైదా - 225 గ్రా., బేకింగ్ పౌడర్ - 2 టీ స్పూన్లు, వాల్నట్స్ - 85 గ్రా., పాలు - 50 మి.లీ.
తయారుచేసే విధానం: ఓవెన్ 180 డిగ్రీ సెల్సియల్స్ దగ్గర ప్రీహీట్ చేసి పెట్టుకోవాలి. కేక్ పాత్ర లోపల వెన్న రాసి ఉంచుకోవాలి. ఒక పాత్రలో బటర్, పంచదార, గుడ్డు సొన, మైదా, బేకింగ్ పౌడర్ వేసి ఉండలు చుట్టకుండా కలపాలి. ఇప్పుడు మెదిపిన అరటిపండ్ల గుజ్జు, వాల్నట్స్ కూడా కలిపి ముద్ద చేసుకోవాలి. దీన్ని బటర్ రాసిన కేక్ టిన్‌లో నింపి ఓవెన్లో గంటసేపు ఉంచాలి. చల్లారిన తర్వాత స్లైస్‌లుగా కట్ చేసుకోవాలి. తినేముందు స్లైస్ పైన వెనిలా ఐస్‌క్రీం కొద్దిగా వేసుకుంటే మరింత రుచిగా ఉంటుంది.