ABN Big Debate: నేను కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కారణం ఇదే: కొప్పుల రాజు

ABN, Publish Date - Apr 29 , 2024 | 07:39 PM

2013-14లో ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ఓడిపోయే సమయంలో.. ఆ పార్టీలో తాను ఎందుకు చేరానన్న ఆసక్తికర విషయాన్ని నెల్లూరు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల రాజు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేముల రాధాకృష్ణతో జరిగిన బిగ్ డిబేట్‌లో భాగంగా పంచుకున్నారు.

2013-14లో ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ఓడిపోయే సమయంలో.. ఆ పార్టీలో తాను ఎందుకు చేరానన్న ఆసక్తికర విషయాన్ని నెల్లూరు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల రాజు (Koppula Raju) ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేముల రాధాకృష్ణతో (Radha Krishna) జరిగిన బిగ్ డిబేట్‌లో (Big Debate) భాగంగా పంచుకున్నారు. తాను ఏపీలో గ్రామీణాభివృద్ధి సంస్థలో పని చేస్తున్న టైంలో.. సెల్ఫ్-హెల్ప్ గ్రూప్‌ని ప్రతి జిల్లాలో అభివృద్ధి చేశామన్నారు. ఆ గ్రూప్స్‌ని బలోపేతం చేయడంతో పాటు గ్రామస్థాయిలో విలేజ్ ఆర్గనైజేషన్స్‌గా ఫెడరేషన్ చేశామని, ఆ తర్వాత మండల సమాఖ్యగానూ, పేద మహిళలకు ఒక మంచి ఆర్గనేజేషనల్ స్ట్రక్చర్‌ని సృష్టించామని తెలిపారు. ఈ ప్రోగ్రామ్ మొదలుపెట్టినప్పుడు బ్యాంకుల నుంచి మహిళా సంఘాలకు కేవలం రూ.50 కోట్లు మాత్రమే రుణాలు వచ్చేవని.. కానీ ఐదేళ్లలో రూ.15 వేల కోట్లు లోన్స్ వచ్చే స్థాయికి తీసుకొచ్చామని పేర్కొన్నారు.


ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి హయాంలో పావలా వడ్డీ రుణాలు, అనంతరం కిరణ్‌కుమార్ రెడ్డి హయాంలో వడ్డీలేని రుణాలు ఇవ్వడం జరిగిందని కొప్పుల రాజు గుర్తు చేశారు. అదే సమయంలో గ్రామీణాభివృద్ధి శాఖలో పేదరిక నిర్మూలన సంస్థను తాను నిర్మించి.. పేద మహిళల కోసం మరెన్నో కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. ఇక యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామన్నారు. ఇది వ్యవసాయ కూలీలకు తప్పకుండా చెందేలాగా ఆర్కిటెక్చర్‌ని తయారు చేయడం జరిగిందన్నారు. ఈ ఉపాధి హామీ పథకాన్ని అనంతపురం నుంచి లాంచ్ చేయడం జరిగిందని, మిగతా రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనే ఈ కార్యక్రమం ముందంజలో ఉండేదన్నారు. ఈ పథకం కింద చాలామందికి ఉద్యోగాలు, పనులు ఇప్పించామని.. అలాగే వెంటనే డబ్బులు అందేలా చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఆపై చేసిన పనులపై ప్రజల చేతే సోషల్ ఆడిటింగ్ చేయించామన్నారు.

కింగ్‌ఫిషర్ బీర్లు దొరకట్లేదు.. ఆదుకోండి మహాప్రభో!!

ఇలా పేద ప్రజల అభివృద్ధికి వినూత్నంగా కార్యక్రమాలు చేపడుతున్నప్పుడు.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్వయంగా రాష్ట్రానికి వచ్చి స్టడీ చేశారని కొప్పుల రాజు పేర్కొన్నారు. మూడు రోజుల పాటు స్టడీ చేసి తనని అమేఠీకి తీసుకెళ్లారని, అక్కడి అధికారులకి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్‌మెంట్ యాక్ట్‌ని ఎలా అమలు చేయాలనే దానిపై శిక్షణ ఇప్పించారన్నారు. అలాగే.. తమ నియోజకవర్గంలో సెల్ఫ్-హెల్ప్ గ్రూప్స్‌ని పెట్టించారన్నారు. రాహుల్ గాంధీతో ఉన్న ఆ పరిచయంతోనే తాను సోనియా గాంధీ ఆధ్వర్యంలో తాను మూడున్నర సంవత్సరాల పాటు జాతీయ సలహా మండలిలో పని చేశానన్నారు. ఆపై తనని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించగా.. 20 సెకన్లలోనే ఆ పార్టీలోకి చేరానని కొప్పుల రాజు చెప్పుకొచ్చారు.

Updated at - Apr 29 , 2024 | 07:39 PM