Share News

కాంగ్రెస్‌ పార్టీని భూస్థాపితం చేస్తాం

ABN , Publish Date - May 09 , 2024 | 01:02 AM

మాదిగలను విస్మరించిన కాంగ్రెస్‌ పార్టీని రాజకీయంగా భూస్థాపితం చేస్తామని ఎమ్మార్పీఎస్‌ నాయకులు అన్నారు.

కాంగ్రెస్‌ పార్టీని భూస్థాపితం చేస్తాం
కొత్లాపూర్‌లో ఎన్నికల ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న ఎమ్మార్పీఎస్‌ నాయకులు

తాండూరు రూరల్‌/యాలాల/మోమిన్‌పేట్‌/ధారూరు/కులకచర్ల/ మే 8 : మాదిగలను విస్మరించిన కాంగ్రెస్‌ పార్టీని రాజకీయంగా భూస్థాపితం చేస్తామని ఎమ్మార్పీఎస్‌ నాయకులు అన్నారు. బుధవారం తాండూరు మండలం కొత్లాపూర్‌, సంగెంకలాన్‌, మల్కాపూర్‌ గ్రామాల్లో ఎమ్మార్పీఎస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు పి.నర్సింహులు మాదిగ ఆధ్వర్యంలో బీజేపీకి ఓటు వేయాలని ప్రచారం నిర్వహించారు. బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కమలం పువ్వుగుర్తుకు ఓటు వేయాలని కోరారు. బీజేపీతోనే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధ్యం అన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌ మండల ఉపాధ్యక్షుడు జగదీష్‌, ప్రవీణ్‌, రవి, ప్రకాష్‌, వెంకటప్ప పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం బీజేసీకి ఓటు వేయాలని ఎంఎ్‌సపీ జిల్లా కార్యదర్శి డప్పు మహేందర్‌, ఎమ్మార్పీఎస్‌ యాలాల మండల అధ్యక్షుడు మెట్ల సూర్యప్రకాశ్‌ కోరారు. రాస్నం, పగిడియాల్‌, అచ్యుతాపూర్‌, ముద్దాయిపేట్‌ ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. ఎంఎ్‌సఎఫ్‌ వికారాబాద్‌ జిల్లా కోకన్వీనర్‌ అజయ్‌ప్రసాద్‌, జానీ పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతోనే సాధ్యమని మహాజన సోషలిస్టు పార్టీ వికారాబాద్‌ జిల్లా అధ్యక్షుడు పి.ఆనంద్‌ అన్నారు. విశ్వేశ్వర్‌రెడ్డికి మద్దతుగా మోమిన్‌పేట్‌ మండలం రామ్‌నాథ్‌గూడుపల్లి, మల్‌రెడ్డిగూడా, గోవిందపూర్‌, టేకులపల్లి గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ నెల 13న జరిగే పోలింగ్‌లో ప్రజలు కమలం గుర్తుకు ఓటు వేయాలని కోరారు. నర్సింహ, శ్రీనివాస్‌, రవీందర్‌ పాల్గొన్నారు. ధారూరు మండలం నాగారం, నాగసమందర్‌, ధారూరు, కేరెల్లి గ్రామాల్లో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ప్రచారం నిర్వహించారు. డమ్మీ ఈవీఎంలు చూపుతూ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పేరు ఉన్న చోట బటన్‌ నొక్కాలని వివరించారు. కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షుడు ఎం.రమేశ్‌, పాండుగౌడ్‌, వివేకానందరెడ్డి, రాజేందర్‌గౌడ్‌, అనిల్‌గౌడ్‌, మణికంఠరెడ్డి పాల్గొన్నారు. విశ్వేశ్వర్‌రెడ్డికి మద్దతుగా కులకచర్ల బీజేపీ నాయకులు ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సౌమ్యరెడ్డి, నాయకులు జానకిరామ్‌, మైపాల్‌, వెంకటేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

కేంద్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే..

చేవెళ్ల/మమేశ్వరం/కందుకూరు కేంద్రంలో రానున్నది బీజేపీ ప్రభుత్వమే అని మాజీ ఎమ్మెల్యే కెఎ్‌స.రత్నం అన్నారు. చేవెళ్ల మండలం దేవరంపల్లి, షాబాద్‌ మండల పరిధిలోని దామర్లపల్లి గ్రామాల్లో ఉన్న కాంగ్రెస్‌, బీఆర్‌ఎ్‌సల కార్యకర్తలు చేవెళ్ల పట్టణ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే కెఎస్‌. రత్నం ఆద్వర్యంలో బీజేపీ పార్టీలో చేరారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమన్నారు. బీజేపీ పథకాలకు ఆకర్షితులై భారీగా పార్టీలో చేరుతున్నారని చెప్పారు. విశ్వేశ్వర్‌రెడ్డి గెలుపు ఖాయమన్నారు. సమావేశంలో చేవెళ్ల మండల అధ్యక్షుడు దేవర పాండురంగారెడ్డి, కృష్ణాగౌడ్‌, అనంత్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, సామ మాణిక్యరెడ్డి, ఎం.రమణారెడ్డి, వెంకట్‌రెడ్డి, వైభవ్‌రెడ్డి, దేవుని శర్వల్వింగం, కుమార్‌, శ్రీనివా్‌సరెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. కాగా నేడు చేవెళ్లలో సాయంత్రం 5గంటలకు ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి రోడ్డు షో ఉంటుందన్నారు. చేవెళ్ల మండలంలోని అన్ని గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు, బూత్‌ కమిటీ సభ్యులు భారీగా తరలివచ్చి రోడ్డును విజయవంతం చేయాలని కోరారు. నరేంద్రమోడితోనే దేశ భద్రత, అభివృద్ధి సాధ్యం అని, ఎన్నికల్లో చేవెళ్ల అభ్యర్థి విశ్వేశ్వర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని తుక్కుగూడ మున్సిపల్‌ బీజేపీ అధ్యక్షుడు రచ్చలక్ష్మణ్‌ అన్నారు. మున్సిపల్‌ పరిధిలో ప్రచారం నిర్వహించారు.

ప్రజా సంక్షేమానికి బీజేపీ ప్రభుత్వం కృషి

కందుకూరు: ప్రజాసంక్షేమానికి బీజేపీ ప్రభుత్వం కృషిచేస్తుందని కేంద్ర మంత్రి గంగాపురం కిషన్‌రెడ్డి అన్నారు. పార్టీ మహేశ్వరం నియోజకవర్గ కన్వీనర్‌ ఎల్మటి దేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో లేమూరు ఎంపీటీసీ యాదయ్య, కొందరు బీఆర్‌ఎస్‌ నాయకులు కిషన్‌రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ ఎన్నికల్లో చేవెళ్ల అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి గెలుపు కోసం ప్రతీ హిందువు ఓట్లు వేయాలన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, అందెల శ్రీరాములుయాదవ్‌, మల్లారెడ్డి, పాండు, బాల్‌రాజ్‌, రవీందర్‌, వెంకటేష్‌, మైసయ్య, రవీందర్‌ పాల్గొన్నారు.

చిలుకూరులో విశ్వేశ్వర్‌రెడ్డి సతీమణి ప్రచారం

మొయినాబాద్‌ రూరల్‌: చిలుకూరు బాలాజీ వేంకటేశ్వరస్వామి ఆశీస్సులతో చేవెళ్ల గడ్డపై కాషాయ జెండాను ఎగరేస్తామని కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సతీమణి సంగీతారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. చిలుకూరు ఆలయంలో పూజలు చేసి గ్రామంలో ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు. భక్తులను సైతం ఆమె మద్దతు కోరారు. ఆమె వెంట సీనియర్‌ నాయకులు గోపాల్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, సహదేవ్‌గౌడ్‌, శ్రీరాములు, మల్లారెడ్డి, దర్గా మహేందర్‌, రాజమల్లేష్‌, విక్రమ్‌రెడ్డి, రమే్‌షచారి, మహేందర్‌, కిషన్‌, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - May 09 , 2024 | 01:02 AM