Share News

వంశీచంద్‌ను గెలిపించాలి

ABN , Publish Date - Apr 29 , 2024 | 12:22 AM

ఎంపీగా వంశీచంద్‌రెడ్డిని గెలిపించాలని మండల కేంద్రంలో ఆదివారం షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌తో కలిసి వంశీచంద్‌ సతీమణి ఆశ్లేషరెడ్డి ప్రచారం చేశారు.

వంశీచంద్‌ను గెలిపించాలి
ఆమనగల్లు : పార్టీలో చేరిన ఎంపీపీలతో రేవంత్‌రెడ్డి

కేశంపేట/కొత్తూరు/షాద్‌నగర్‌, ఏప్రిల్‌ 28: ఎంపీగా వంశీచంద్‌రెడ్డిని గెలిపించాలని మండల కేంద్రంలో ఆదివారం షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌తో కలిసి వంశీచంద్‌ సతీమణి ఆశ్లేషరెడ్డి ప్రచారం చేశారు. కేశంపేట మండల కేంద్రంతో పాటు వేమల్‌నర్వలో ఇంటింటి ప్రచారం చేశారు. మండలాధ్యక్షుడు వీరేశ్‌, జడ్పీటీసీ విశాలశ్రవణ్‌రెడ్డి, అల్వాల ఎంపీటీసీ లంకాల సురే్‌షరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలకు ఓటువేస్తే దేశానికి చేటేనని ఆశ్లేషరెడ్డి అన్నారు. కొత్తూరు మండలంలో ఎమ్మెల్యే వీర్లపల్లి, ఆయన సతీమణి అనురాధతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వంశీచంద్‌రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. కేశంపేట జడ్పీటీసీ విశాల శ్రావణ్‌రెడ్డి, కొత్తూరు మున్సిపల్‌ కౌన్సిలర్లు మండలాధ్యక్షుడు హరినాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే షాద్‌నగర్‌ పట్టణంలో కన్యకాపరమేశ్వరి ఆలయం వద్ద ప్రచారం చేశారు.

కాంగ్రెస్‌లో చేరిన ఇద్దరు ఎంపీపీలు

ఆమనగల్లు : పీసీసీ అధికార ప్రతినిధి బాలాజీసింగ్‌, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆధ్వర్యంలో వంగూరు ఎంపీపీ బీమమ్మ లాలూయాదవ్‌, చారకొండ ఎంపీపీ నిర్మల విజయేందర్‌గౌడ్‌, పలువురు ఎంపీటీసీ సభ్యులు, మాజీ సర్పంచులు సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో నగరంలో కాంగ్రెస్‌లో చేరారు. పెద్దఎత్తున చేరికలకు చొరవ తీసుకుంటున్న బాలాజీసింగ్‌ను సీఎం అభినందించారు.

బీజేపీతోనే సుస్థిర పాలన

బీజేపీతోనే దేశ భద్రత, సుస్థిర పాలన సాధ్యమని ఎన్‌బీసీ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి అన్నారు. పదేళ్ల బీజేపీ పాలనలో దేశం అద్భుత విజయాలు సాధించిందన్నారు. ఆమనగల్లు మున్సిపాలిటీ 3వ వార్డు సాకిబండతండా, ఎర్రబీక్యతండా, నుచ్చుగుట్ట తండాలలో ఆదివారం ఆచారి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బీజేపీ పాలనలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలను వివరిస్తూ పార్లమెంట్‌ ఎన్నికల్లో మరో మారు బీజేపీని ఆదరించి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. బీజేపీ నాయకులు రవిరాథోడ్‌, నంగ్య్ర నాయక్‌, మహేశ్‌, రాము, మహిపాల్‌, గోర్య, గోపాల్‌, దేవేందర్‌, తదితరులున్నారు.

Updated Date - Apr 29 , 2024 | 12:22 AM