Share News

తాగునీటి కోసం తండ్లాట!

ABN , Publish Date - Apr 28 , 2024 | 11:40 PM

మండంలోని ఊటువల్లి తండాలో తాగునీటి కోసం తండా వాసులు అవస్థలు పడుతున్నారు.

తాగునీటి కోసం తండ్లాట!
ఊటువల్లి తండాలో వ్యవసాయ బోర్ల నుంచి తాగునీరు తెచ్చుకుంటున్న మహిళలు

దోమ, ఏప్రిల్‌ 28 : మండంలోని ఊటువల్లి తండాలో తాగునీటి కోసం తండా వాసులు అవస్థలు పడుతున్నారు. మిషన్‌ భగీరథ తాగునీరు వారంలో ఒక రోజు సరఫరా కావడంతో ఉన్న సింగిల్‌ ఫేజ్‌ మోటార్‌లో భూగర్భ జలాలు అడుగంటి సరిపడే నీరు రావడం లేదు. దీంతో తండావాసులు నీటి కోసం తండ్లాడుతున్నారు. ఎక్కడా తాగునీటి సమస్య ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ఆదేశాలున్నా క్షేత్రస్థాయిలో అధికారుల నిర్లక్ష్యంతో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు.

తాగునీటి కోసం రోజూ ఇబ్బంది పడుతున్నాం

తండాలో ఉన్న సింగిల్‌ఫేజ్‌ బోరులో సరిపడే నీరు రావడం లేదు. రోజూ మేం తాగునీటి కోసం తెల్లవారుజాము నుంచే బోరు వద్ద బిందెలతో బారులు తీరుతున్నాం. తండాలో ఉన్న ఉన్న బోరు నీరు సరిపోక వ్యవసాయ బోర్ల వద్దకు పోయి నీరు తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా అధికారులు తండాలో నీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. - రమణిబాయి, ఊటువల్లి తండా

Updated Date - Apr 28 , 2024 | 11:40 PM