Share News

ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలి

ABN , Publish Date - Apr 29 , 2024 | 12:21 AM

ప్రతీ ఒక్కరు ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని షాద్‌నగర్‌ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ అన్నారు. ఆదివారం మండల పరిధిలోని భైరంపల్లిలో బొడ్రాయి, మైసమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన ఘనంగా నిర్వహించారు.

ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలి
కొందుర్గు : పూజల్లో పాల్గొన్న అంజయ్య యాదవ్‌, గ్రామస్థులు

మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌

భైరంపల్లిలో బొడ్రాయి, మైసమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన

కొందుర్గు, ఏప్రిల్‌ 28: ప్రతీ ఒక్కరు ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని షాద్‌నగర్‌ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ అన్నారు. ఆదివారం మండల పరిధిలోని భైరంపల్లిలో బొడ్రాయి, మైసమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన ఘనంగా నిర్వహించారు. వారు పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుత కంప్యూటర్‌ యుగంలో ప్రతీ ఒక్కరు ఏదో ఒక రకంగా ఒత్తిడికి గురవుతున్నారని, దైవ చింతన అలవర్చుకోవాలని, దీనిద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. అనంతరం గ్రామస్థులు ప్రత్యేక పూజలు చేశారు. వైస్‌ ఎంపీపీ రాజేష్‌పటేల్‌, సున్నాల శ్రీనివాస్‌, రామయ్య, యాదయ్య, అంజనేయులు, శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

కనుల పండువగా రథోత్సవం

తలకొండపల్లి : జిల్లాలో ప్రసిద్ధిగాంచిన మండలంలోని వెంకటాపూర్‌ లక్ష్మీ నారాయణ స్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేవాలయాన్ని పచ్చటి తోరణాలు, పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. బ్రహ్మోత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు. ఆలయ చైర్మన్‌ తిరుమణి శేఖర్‌గౌడ్‌, వైస్‌ చైర్మన్‌ అంజన్‌ రెడ్డిల ఆధ్వర్యంలో భక్తులకు విశాల వసతులు ఏర్పాటుచేశారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామివారి రథోత్సవాన్ని కనుల పండువగా నిర్వహించారు. వెంకటాపూర్‌తో పాటు సమీప గ్రామాల ప్రజలు, భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. రథాన్ని శోభాయమానంగా అలంకరించి ఉత్సవ విగ్రహాలను ఉంచి తాళ్లతో లాగారు. భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయంలో స్వామివారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ రమేశ్‌ యాదవ్‌, అర్చకులు యాదగిరి నర్సింహ శాస్త్రి, కామేశ్వర మూర్తి, నాయకులు, భక్తులు పాల్గొన్నారు.

Updated Date - Apr 29 , 2024 | 12:21 AM