Share News

బీజేపీ వస్తే రిజర్వేషన్లు పోతాయ్‌

ABN , Publish Date - Apr 29 , 2024 | 12:16 AM

దేశంలో బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు పోతాయని చేవెళ్ల కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి రంజిత్‌రెడ్డి అన్నారు. మొయినాబాద్‌ మండలంఎన్కేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో రంజిత్‌రెడ్డి జిల్లాకు చెందిన వికలాంగుల సంఘం సభ్యులతో సమావేశమయ్యారు.

బీజేపీ వస్తే రిజర్వేషన్లు పోతాయ్‌
చర్లగూడలో ప్రచారం చేస్తున్న రంజిత్‌రెడ్డి సతీమణి సీతారెడ్డి

కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి రంజిత్‌రెడ్డి

మొయినాబాద్‌ రూరల్‌, ఏప్రిల్‌ 28: దేశంలో బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు పోతాయని చేవెళ్ల కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి రంజిత్‌రెడ్డి అన్నారు. మొయినాబాద్‌ మండలంఎన్కేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో రంజిత్‌రెడ్డి జిల్లాకు చెందిన వికలాంగుల సంఘం సభ్యులతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ బీజేపీ అభ్యర్థి కేవలం టూర్ల వ్యక్తి అని.. నియోజకవర్గ అభివృద్ధికి ఏనాడూ కృషి చేయలేదని ఆరోపించారు. కొవిడ్‌ సమయంలో ప్రజల ముందు తానే ఉన్నానని.. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాత్రం విదేశీ యాత్రలో నిమగ్నమయ్యారన్నారు. రంగారెడ్డి జిల్లా వికలాంగల సంఘం అధ్యక్షుడు వడ్ల నర్సింహచారి, నాయకులున్నారు.

యువజన కాంగ్రెస్‌ నాయకులు సైనికుల్లా పనిచేయాలి

పెద్దేముల్‌ : పార్లమెంట్‌ ఎన్నికల్లో యువజన కాంగ్రెస్‌ నాయకులు సైనికుల్లా పనిచేయాలని తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి యువతకు పిలుపునిచ్చారు. పెద్దేముల్‌ మండల యూత్‌కాంగ్రెస్‌ అధ్యక్షుడు వెంకట్‌ ఆధ్వర్యంలో ఆదివారం తాండూరు మండలం అంతారం గుట్టపైన ఏర్పాటు చేసిన మండల యూత్‌కాంగ్రెస్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు.

జోరుగా కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచారం

ధారూరు/పూడూరు/తాండూరు: ధారూరు మండలంలో రంజిత్‌రెడ్డికి మద్దతుగా పార్టీ శ్రేణులు ఇంటింటి ప్రచారం చేశారు. పూడూరు మండలం సిరిగాయిపల్లిలో నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. జిల్లా ఆర్టీఏ మాజీ మెంబర్‌ జావీద్‌తో పాటు మరికొంత మంది ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి సమక్షంలో కాంగ్రె్‌సలో చేరారు. తాండూరు పట్టణానికి చెందిన చంద్‌, 50మంది బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. పట్టణ అధ్యక్షుడు హబీబ్‌ లాల, జడ్పీటీసీ ధారాసింగ్‌, మైనార్టీ నాయకులు అబ్దుల్‌ రవూఫ్‌ పాల్గొన్నారు.

రంజిత్‌రెడ్డి గెలుపునకు సహకరించాలి

కందుకూరు/చేవెళ్ల : రంజిత్‌రెడ్డి గెలుపునకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని, రాష్ట్రంలో సీఎం ఎనుములు రేవంత్‌రెడ్డి ఇచ్చిన ప్రతి హామీని నేరవేర్చనున్నట్లు పీసీసీ సభ్యుడు ఏనుగు జంగారెడ్డి, జడ్పీటీసీ బొక్క జంగారెడ్డిలు అన్నారు. ఏనుగు జంగారెడ్డి మండలంలోని దెబ్బడగూడలో ప్రచారం నిర్వహించగా, జడ్పీటీసీ కందుకూరులో ఇంటింటికి వెళ్లి ఆరు గ్యారంటీలను ప్రజలకు క్లుప్తంగా వివరించారు. ఈ సందర్భంగా దెబ్బడగూడకు చెందిన బీజేపీ, బీఆర్‌ఎస్‌ నాయకులు పలువురు ఏనుగు జంగారెడ్డి సమక్షంలో కాంగ్రె్‌సలో చేరారు. కాగా, కాంగ్రె్‌సతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని డీసీసీ ఉపాధ్యక్షుడు బండారు ఆగిరెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్లు వెంకట్‌రెడ్డి, ప్రతా్‌పరెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఎన్డీఏ అధికారంలో ఉన్నా అభివృద్ధి శూన్యం

షాబాద్‌ : దేశంలో ఎన్డీయే పదేళ్లు అధికారంలో ఉన్నా.. అభివృద్ధి శూన్యమని ఎంపీ అభ్యర్థి రంజిత్‌రెడ్డి సతీమణి సీతారెడ్డి అన్నారు. మండల పరిధిలోని చర్లగూడ, యెల్గొండగూడ, ఆస్పల్లిగూడ, ఉబ్బగుంట, గొల్లూర్‌గూడ గ్రామాల్లో రంజిత్‌రెడ్డికి ఓటువేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరుతూ ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి ఎలుగంటి మధుసూదన్‌రెడ్డి, పీసీసీ కార్యదర్శులు పీసరి సురేందర్‌రెడ్డి, రాంరెడ్డి తదితరులున్నారు.

మహేశ్వరం గడ్డ.. కాంగ్రెస్‌ అడ్డా

మహేశ్వరం : మహేశ్వరం కాంగ్రె్‌సకు అడ్డాగా తయారు అవుతుందని, నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీని తిరుగులేని శక్తిగా తయారు చేయాలని జడ్పీ చైర్‌పర్సన్‌ అనితారెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం గంగారం, గంగారం తండాలకు చెందిన 200 మంది బీజేపీ, బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు కాంగ్రె్‌సలో చేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కె.రఘుమారెడ్డి, కృష్ణానాయక్‌, పాండునాయక్‌ పాల్గొన్నారు. చేవెళ్ల మండలం రేగడిఘనాపూర్‌, దేవరంపల్లి, కుమ్మెర, ధర్మసాగర్‌ గ్రామాల్లో విశ్వేశ్వర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రచారం చేశారు.

ప్రజా సంక్షేమాన్ని కోరుకునే పార్టీ కాంగ్రెస్‌

ఎల్‌బీనగర్‌/సరూర్‌ నగర్‌: కాంగ్రెస్‌ ప్రజా సంక్షేమాన్ని కోరుకునే పార్టీ అని పీసీసీ ప్రతినిధి దేప భాస్కర్‌రెడ్డి అన్నారు. ఎల్‌బీనగర్‌ పరిధిలోని గ్రీన్‌హిల్స్‌కాలనీలో ఇంటింటి ప్రచారం చేశారు. రంజిత్‌రెడ్డిని గెలిపించాలని డాక్టర్స్‌కాలనీ, జేబీకాలనీ, డాక్టర్స్‌కాలనీ సౌత్‌లలో కాంగ్రెస్‌ కార్యకర్తలు ప్రచారం చేశారు. బడంగ్‌పేట్‌ మేయర్‌ చిగిరింత పారిజాత పలు డివిజన్లలో ప్రచారం నిర్వహించారు.

Updated Date - Apr 29 , 2024 | 12:16 AM