Share News

మోదీతోనే దేశాభివృద్ధి

ABN , Publish Date - Apr 29 , 2024 | 12:05 AM

దేశాభివృద్ధి ప్రధాని నరేంద్రమోదీతోనే సాధ్యమని చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని మదన్‌పల్లిలోని వివిధ పార్టీలకు చెందిన వందమంది కార్యకర్తలు ఆయన సమక్షంలో గ్రామంలో బీజేపీలో చేరారు.

మోదీతోనే దేశాభివృద్ధి
విశ్వేశ్వర్‌రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరుతున్న వివిధ పార్టీల కార్యకర్తలు

  • కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

శంషాబాద్‌ రూరల్‌, ఏప్రిల్‌ 28: దేశాభివృద్ధి ప్రధాని నరేంద్రమోదీతోనే సాధ్యమని చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని మదన్‌పల్లిలోని వివిధ పార్టీలకు చెందిన వందమంది కార్యకర్తలు ఆయన సమక్షంలో గ్రామంలో బీజేపీలో చేరారు. ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశం ఎంతో అభివృద్ధి సాధించిందని, కేంద్రం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్‌ ప్రేంరాజ్‌, జిల్లా నాయకులు తదితరులున్నారు.

బీఆర్‌ఎ్‌సకు ఓటు వేస్తే వృథా

కందుకూరు: ఎన్నికల్లో బీఆర్‌ఎ్‌సకు ఓటు వేస్తే వృథా అవుతుందని.. అభ్యర్థి లేక ఇతర పార్టీ నుంచి అరువు తెచ్చుకున్నారని విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. మండలంలోని రాచులూరు సర్పంచ్‌, బీఆర్‌ఎస్‌ నేత శ్రీనివాసచారి ఆధ్వర్యంలో పలువురు నేతలు నగరంలో కొండా సమక్షంలో పార్టీలో చేరారు. విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ దేశం కోసం జరుగుతున్న ఎన్నికల్లో బీఆర్‌ఎ్‌సకు ఓటు వేస్తే బూడిదలో పోసిన పన్నీరులా మారుతుందన్నారు. ఈ ఎన్నికల్లో తనకు అన్ని వర్గాల ప్రజలు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆ పార్టీ నియోజకరవ్గం ఇన్‌చార్జి అందెల శ్రీరాములుయాదవ్‌, కన్వీనర్‌ ఎల్మటి దేవేందర్‌ రెడ్డి, నాయకులు పున్న భిక్షపతి, ఆంజనేయులు, రవీందర్‌, యాదగిరి, శ్రీశైలం, నరేందర్‌, తదితరులు పాల్గొన్నారు.

బీజేపీపై కాంగ్రె్‌సది తప్పుడు ప్రచారం

శంషాబాద్‌: బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని కాంగ్రెస్‌ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తుందని, ప్రజలు నమ్మవద్దని విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించి బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుందని ఓర్వలేకనే కాంగ్రెస్‌ తప్పుడు ప్రచారం చేపట్టిందన్నారు. శంషాబాద్‌లో ఆదివారం రాత్రి బైక్‌ర్యాలీ చేపట్టి, ఎమ్మార్పీఎస్‌ నాయకులతో సమావేశం నిర్వహించారు. అనంతరం రోడ్‌షోలో మాట్లాడారు. రాహుల్‌గాంధీ గెలువలేనన్న భయంతోనే అత్యధిక ముస్లిం ఓటర్లు ఉన్న వయనాడ్‌ నుంచి పోటీ చేస్తున్నారని, ఇది సిగ్గుచేటని అన్నారు. రాష్ట్ర కార్యవర్గసభ్యుడు ప్రేంరాజ్‌ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహరెడ్డి కన్వీన ర్‌ మల్లే్‌షయాదవ్‌, భీమార్జున్‌రెడ్డి, తదితరులున్నారు.

మోసపూరిత హామీలతో గెలిచిన కాంగ్రెస్‌

రాజేంద్రనగర్‌: కాంగ్రెస్‌ మోసపూరిత హామీలతో అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిందని, పార్లమెంటు ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి పప్పులు ఉడకవని, 12 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యత సాధించబోతున్నారని విశ్వేశ్వర్‌రెడ్డి ధీమా వ్యక్తం చేసారు. బీజేపీ శ్రేణులతో కలసి రాజేంద్రనగర్‌ సర్కిల్‌ పరిధిలోని అత్తాపూర్‌, రాజేంద్రనగర్‌, మైలార్‌దేవుపల్లి డివిజన్‌లలో ఆయన బైక్‌ ర్యాలీ నిర్వహించారు. హైదర్‌గూడ సుభా్‌ష విగ్రహం వద్ద మాట్లాడుతూ రాహుల్‌ హిందువులకు ప్రతినిఽధి కాదా? అని ప్రశ్నించారు.

మచ్చలేని మహానేత ‘కొండా’

తాండూరు/పూడూరు/వికారాబాద్‌/ధారూరు/కులకచర్ల/పెద్దేముల్‌/హైదర్‌నగర్‌: అవినీతి, స్కామ్‌ ఆరోపణలు లేని మచ్చలేని మహా నాయకుడు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు నరేష్‌ మహరాజ్‌ అన్నారు. తాండూరు బీజేపీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. భారీ మెజార్టీ కోసమే తాము ప్రయత్నిస్తున్నామని అన్నారు. విక్రం, పట్టణ మాజీ అధ్యక్షుడు సుదర్శన్‌గౌడ్‌ పాల్గొన్నారు. కాగా, పరిగి నియోజకవర్గంలో సమస్యలు పరిష్కరించడం విశ్వేశ్వర్‌రెడ్డికే సాధ్యమని ఆయన సతీమణి కొండా సంగీతారెడ్డి అన్నారు. పరిగి నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం, గడిసింగాపూర్‌ గ్రామాలతోపాటు పరిగి పట్టణంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బీజేపీలో చేరారు. కొండా సంగీతారెడ్డి ఆధ్వర్యంలో యువకులు, మహిళలు వందలాదిగా తరలివచ్చి బీజేపీలో చేరారు. కాగా, గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులన్నీ మోదీ చలవేనని బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి తనయుడు విశ్వజిత్‌రెడ్డి అన్నారు. వికారాబాద్‌ పరిధిలోని పెండ్లిమడుగు, నారాయణపూర్‌, పులుమద్ది, ఎర్రవల్లి, మదన్‌పల్లి, మైలార్‌ దేవరంపల్లి, పీలారం, రాళ్ల చిట్టంపల్లి గ్రామాల్లో ఆదివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శివరాజ్‌ వికారాబాద్‌ మునిసిపల్‌ పరిధిలోని శివారెడ్డిపేట, కొత్రేపల్లి గ్రామాల్లో ప్రచారం చేశారు. కొత్రేపల్లి, వెంకటపూర్‌ నుంచి 100మంది యువకులు బీజేపీలో చేరారు. విశ్వేశ్వర్‌రెడ్డిని గెలిపించాలని బీజేపీ శ్రేణులు ధారూరు మండలంలోని మోమిన్‌కుర్థు, రాజూపూర్‌, పీసీఎం తండా, గురుదోట్ల, అంపల్లి గ్రామాల్లో ప్రచారం చేశారు. అల్లాపూర్‌లో నాయకులు ప్రచారం నిర్వహించారు. పెద్దేముల్‌ మండలం మారెపల్లి, మంబాపూర్‌లో ఎమ్మార్పీఎస్‌ జిల్లా అధ్యక్షులు మల్లికార్జున్‌ మాదిగ ప్రచా రం చేశారు. విశ్వేశ్వరరెడ్డికి మద్దతుగా ఆయన సోదరి అనితారెడ్డి హైదర్‌నగర్‌లో ప్రచారం చేశారు.

Updated Date - Apr 29 , 2024 | 12:05 AM