Share News

బీజేపీతోనే దేశాభివృద్ధి సాధ్యం

ABN , Publish Date - Apr 29 , 2024 | 12:01 AM

బీజేపీతోనే దేశాభివృద్ధి సాధ్యపడతుందని మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ అభ్యర్ధి ఈటల రాజేందర్‌ తెలిపారు. మండలంలోని సర్పంచ్‌ల సంఘం జిల్లా మాజీ కన్వీనర్‌, ఎదులాబాద్‌ మాజీ సర్పంచ్‌ బట్టె శంకర్‌ తన 40మంది అనుచరులతో ఆదివారం శామీర్‌పేటలోని ఈటల ఫాంహౌజ్‌లో ఆదివారం బీజేపీలో చేరారు.

బీజేపీతోనే దేశాభివృద్ధి సాధ్యం
ఘట్‌కేసర్‌ రూరల్‌: ఈటల రాజేందర్‌ సమక్షంలో బీజేపీలో చేరిన జిల్లా సర్పంచ్‌ల సంఘం మాజీ కన్వీనర్‌ బట్టె శంకర్‌

ఘట్‌కేసర్‌ రూరల్‌/ శామీర్‌పేట/ నాచారం/ తిరుమలగిరి ఏప్రిల్‌ 28: బీజేపీతోనే దేశాభివృద్ధి సాధ్యపడతుందని మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ అభ్యర్ధి ఈటల రాజేందర్‌ తెలిపారు. మండలంలోని సర్పంచ్‌ల సంఘం జిల్లా మాజీ కన్వీనర్‌, ఎదులాబాద్‌ మాజీ సర్పంచ్‌ బట్టె శంకర్‌ తన 40మంది అనుచరులతో ఆదివారం శామీర్‌పేటలోని ఈటల ఫాంహౌజ్‌లో ఆదివారం బీజేపీలో చేరారు. ఈటల రాజేందర్‌ పార్టీలో చేరిన నాయకులకు కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో బట్టె లక్ష్మన్‌రావు, ఎంకే నాగరాజు, మోహన్‌రెడ్డి, నరేష్‌, రంజిత్‌, నందు, మనీ, అఖిల్‌, చిత్తరంజన్‌, నాగేష్‌ తదితరులకు కండువా కప్పి పార్టీలో అహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు విక్రంరెడ్డి, ఎంపీపీ ఏనుగు సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా ఈటల రాజేందర్‌ నివాసం వద్ద బీజేపీ నాయకుడు సుదర్శన్‌ ఆధ్వర్యంలో ఈటల రాజేందర్‌ సమక్షంలో శామీర్‌పేట గ్రామం, పెద్దమ్మ కాలనీకి చెందిన పంచాయతీ వార్డు మాజీ సభ్యుడు ఉప్పలయ్యతో పాటు దాదాపు 100మంది నాయకులు, కార్యకర్తలు బీఆర్‌ఎస్‌ నుంచి బీజేపీలో చేరారు. నాచారం డివిజన్‌లో ఈటల రాజేందర్‌ ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరగా కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. అదేవిధంగా కంటోన్మెంట్‌ నియోజకవర్గం వార్‌-7 అరుణ్‌ ఎన్‌క్లేవ్‌లో కంటోన్మెంట్‌ బోర్డు నామినేటెడ్‌ సభ్యుడు జె.రామకృష్ణ నేతృత్వంలో జరిగిన కాలనీవాసుల సమావేశంలో ఈటల ముఖ్య అతిథిగా పాల్గొని సీఎంపై విమర్శలు గుప్పించారు.

బీజేపీ నాయకుల ఇంటింటి ప్రచారం

ఘట్‌కేసర్‌ రూరల్‌/శామీర్‌పేట/ వినాయక నగర్‌/హయత్‌నగర్‌/కొత్తపేట/ఫతేనగర్‌/మౌలాలి: ఘట్‌కేసర్‌ పరిధి అంకుషాపూర్‌లో బీజేపీ మండల అధ్యక్షుడు చలువాది ప్రవీణ్‌రావు ఆదివారం ఈటల రాజేందర్‌ను గెలిపించాలని ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. అదేవిధంగా శామీర్‌పేట మండలం తూంకుంటలో మండల బీజేపీ నాయకులు కాసుల కరుణాకర్‌గౌడ్‌, కాసుల సుభా్‌షగౌడ్‌ ఆధ్వర్యంలో మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ కోడలు ఈటల క్షమిత పార్టీ నాయకులు ఆదివారం ఇంటింటి ప్రచారం చేశారు. అదేవిధంగా అదేవిధంగా వినాయకనగర్‌ డివిజన్‌లోని సాయికుటీర్‌, ఈస్ట్‌ కాకతీయనగర్‌లలో ఈటల సతీమణి జమున ప్రచారంలో పాల్గొన్నారు. ఈకార్యక్రమంలో కార్పొరేటర్‌ రాజ్యలక్ష్మీతో పాటు మహిళ నాయకులు పాల్గొన్నారు. మన్సూరాబాద్‌ డివిజన్‌ హయత్‌నగర్‌ ఏరియాలోని కొలన్‌ శివారెడ్డికాలనీ, టీ. నగర్‌కాలనీలలో ఆదివారం ఈటల రాజేందర్‌ సతీమణి ఈటల జమునతో కలిసి మన్సూరాబాద్‌ కార్పొరేటర్‌ కొప్పుల నరసింహారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నాగోల్‌ నాయకులుఆదివారం నాగోల్‌ శుభం ఫంక్షన్‌హాల్‌ ఆవరణలో బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు పంగా శ్యాంకుమార్‌ మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ సమక్షంలో బీజేపీలో చేరారు. అదేవిధంగా బీజేపీలో ఇటీవల చేరిన సీనియర్‌ నాయకుడు సుర్వి రాజుగౌడ్‌ ఆధ్వర్యంలో రంగారెడ్డి అర్బన్‌ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి సమక్షంలో 20 మంది స్థానిక నాయకులు, బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు బీజేపీలో చేరారు. నాగోల్‌ డివిజన్‌ పరిధిలోని పోలింగ్‌ బూత్‌ నెం.92 పరిధిలో పార్టీ రంగారెడ్డి అర్బన్‌ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి ఇంటింటి ప్రచారం చేశారు. కూకట్‌పల్లి బీజేపీ ఇన్‌చార్జి మాధవరం కాంతారావు ఫతేనగర్‌లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఆయన వెంట కంచి మహేందర్‌, కృష్ణగౌడ్‌, రామ్మోహన్‌ ఉన్నారు. మౌలాలి డివిజన్‌లోని కార్పొరేటర్‌ గునన్నాల సునీతయాదవ్‌ కార్యాలయంలో, వినాయకనగర్‌ డివిజన్‌ సూర్యోదయ ఫంక్షన్‌హాల్‌లో కార్పొరేటర్‌ రాజ్యలక్ష్మి అధ్యక్షతన మల్కాజిగిరి నియోజకవర్గ ఇన్‌చార్జి, తమిళనాడు రాష్ట్ర ఎమ్మెల్యే ప్రేమకుమారి బూత్‌స్థాయి నాయకులతో సమావేశం నిర్వహించారు. గౌతంనగర్‌ డివిజన్‌లోని సాయినగర్‌, యాదవ్‌నగర్‌, సంజయ్‌నగర్‌లలో డివిజన్‌ అధ్యక్షుడు లక్ష్మణ్‌రావు ఆధ్వర్యంలో, మల్కాజిగిరి డివిజన్‌ పరిధిలోని కృపా ఆనంద్‌ అపార్ట్‌మెంట్స్‌లో బీజేపీ కార్యకర్తలు ప్రచారం చేశారు.

Updated Date - Apr 29 , 2024 | 12:01 AM