Share News

కొనుగోలు కేంద్రంలో ధాన్యం కాంటాల పరిశీలన

ABN , Publish Date - Apr 27 , 2024 | 12:30 AM

వరి ధాన్యం కొనుగోళ్లను జిల్లా అధికారులు దగ్గరుండి ప్రారంభించారు. ఆంధ్రజ్యోతిలో శుక్రవారం ప్రచురితమైన ధాన్యం కొనుగోలు చేసేదెన్నడో అనే కథనానికి స్పందించిన అధికారులు బొంరాస్‌పేట్‌, మెట్లకుంట తదితర గ్రామాల్లో పర్యటించి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కాంటాలను పరిశీలించారు.

కొనుగోలు కేంద్రంలో ధాన్యం కాంటాల పరిశీలన
బొంరాస్‌పేట్‌లో కొనుగోలు కేంద్రంలో ధాన్యం తేమ శాతం పరిశీలిస్తున్న అధికారులు

బొంరాస్‌పేట్‌, ఏప్రిల్‌ 26: వరి ధాన్యం కొనుగోళ్లను జిల్లా అధికారులు దగ్గరుండి ప్రారంభించారు. ఆంధ్రజ్యోతిలో శుక్రవారం ప్రచురితమైన ధాన్యం కొనుగోలు చేసేదెన్నడో అనే కథనానికి స్పందించిన అధికారులు బొంరాస్‌పేట్‌, మెట్లకుంట తదితర గ్రామాల్లో పర్యటించి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కాంటాలను పరిశీలించారు. పౌరసరఫరాల జిల్లా అధికారిణి నాగమణి, రాజేశ్వర్‌లు బొంరాస్‌పేట్‌ మండలంలో ధాన్యం తూకాలు వేయించారు. బొంరాస్‌పేట్‌, కొత్తూర్‌, దుప్‌చర్ల, చౌదర్‌పల్లి, చిలుముల్‌మైలారం, లగచర్ల గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలకు 5వేల చొప్పున గన్నీ బ్యాగులు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఏర్పుమళ్ల గ్రామానికి సమీపంలో గల రైస్‌మిల్లు నుంచి గన్నీ బ్యాగులు కేటాయించినట్లు తెలిపారు. ప్రతీ కేంద్రంలో తేమ శాతం 17 ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని నిర్వాహకులకు సూచించారు. బొంరాస్‌పేట్‌లో బస్తాలు తూకం వేసేంత వరకు పరిశీలించి వెళ్లారు. ఈ సందర్భంగా మార్కెటింగ్‌ ఏపీయం కిష్టప్ప, సిబ్బంది మల్లికార్జున్‌, వెంకటయ్య తదితరులు ఉన్నారు.

Updated Date - Apr 27 , 2024 | 12:30 AM