Share News

నాది సాయం చేసే గుణం

ABN , Publish Date - May 09 , 2024 | 12:45 AM

నా దగ్గర ప్రత్యర్థి పార్టీల అభ్యర్థుల దగ్గర ఉన్నంత డబ్బు లేకపోవచ్చు కానీ, అడిగిన వారికి సాయం చేసే గుణం ఉందని కాంగ్రెస్‌ చేవెళ్ల నియోజకవర్గం ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్‌రెడ్డి అన్నారు.

నాది సాయం చేసే గుణం
మీర్‌పేట్‌లో మాట్లాడుతున్న రంజిత్‌రెడ్డి

చేవెళ్ల కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి రంజిత్‌రెడ్డి

సరూర్‌నగర్‌, మే 8 : నా దగ్గర ప్రత్యర్థి పార్టీల అభ్యర్థుల దగ్గర ఉన్నంత డబ్బు లేకపోవచ్చు కానీ, అడిగిన వారికి సాయం చేసే గుణం ఉందని కాంగ్రెస్‌ చేవెళ్ల నియోజకవర్గం ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్‌రెడ్డి అన్నారు. మంగళవారం రాత్రి మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డితో కలిసి మీర్‌పేట్‌ కార్పొరేషన్‌లో రోడ్‌ షో నిర్వహించి కార్నర్‌ మీటింగ్‌లో మాట్లాడారు. గతంలో తాను ఎంపీగా, తీగల ఎమ్మెల్యేగా ఉండి మీర్‌పేట్‌ ప్రాంతాన్ని అభివృద్ధి చేశామని, తనను మరోసారి గెలిపిస్తే మున్ముందు మరింత అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. ఇక్కడి సమస్యలను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. హస్తం గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

రంజిత్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి

మహేశ్వరం/కందుకూరు :రంజిత్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని జడ్పీ చైర్‌పర్సన్‌ అనితారెడ్డి కోరారు. బుధవారం మహేశ్వరం మండలం అమీర్‌పేట, హర్శగూడలో ఇంటింటి ప్రచారం నిర్వహించి ఆరు గ్యారెంటీలను ప్రజలకు వివరించారు. హర్శగూడ బీఆర్‌ఎస్‌ ఎంపీటీసీ విజయ్‌ కాంగ్రె్‌సలో చేరారు. కేఎల్లార్‌, యాదయ్య, పాండునాయక్‌, తదితరులున్నారు. రంజిత్‌రెడ్డి గెలుపునకు సహకరించాలని పీసీసీ సభ్యులు జంగారెడ్డి, జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి కందుకూరు మండలం జైత్వారం, సరాస్వతిగూడలో ప్రచారం చేశారు. దావుత్‌గూడకు చెందిన మాజీ ఉపసర్పంచ్‌ ధన్‌సింగ్‌ బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రె్‌సలో చేరారు.

కాంగ్రెస్‌ గెలుపే లక్ష్యంగా పని చేయాలి

చేవెళ్ల/మొయినాబాద్‌ రూరల్‌ : కాంగ్రెస్‌ గెలుపే లక్ష్యంగా పని చేయాలని చేవెళ్ల ఇన్‌చార్జి పామెన భీంభరత్‌ అన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారం చేశారు. ఎంపీ రంజిత్‌రెడ్డి గెలుపునకు కృషి చేస్తానని కాంగ్రెస్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి, సీనియర్‌ నాయకుడు గౌరీ సతీష్‌ అన్నారు. గౌరీ సతీష్‌ చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ మేనేజింగ్‌ కమిటీ చైర్మన్‌గా నియమితులయ్యారు. ఆయనకు రాష్ట్ర మేనేజింగ్‌ కమిటీ చైర్మన్‌ దిలీ్‌పకుమార్‌, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌, కత్తి వెంకటస్వామిలు నియామకపత్రాన్ని అందజేశారు.

రంజిత్‌ రెడ్డిని దీవించండి : స్పీకర్‌

ధారూరు : నన్ను దీవించి ఆశీర్వదించినట్లే రంజిత్‌ రెడ్డిని కూడా దీవించి ఆశీర్వదించాలని స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ అన్నారు. వికారాబాద్‌ మండలం మైలార్‌ దేవరంపల్లిలో రోడ్‌ షో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఎలక్షన్‌ కోడ్‌ అనంతరం మైలార్‌ దేవరంపల్లిలో సీసీ రోడ్ల కోసం రూ.200 కోట్లు మంజూరుకై కృషి చేస్తానని తెలిపారు. మండలాధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డిలున్నారు. ధారూరు, స్టేషన్‌ ధారూరు, కుక్కింద, గడ్డమీది గంగారం, నాగారం, కొండాపూర్‌ కలాన్‌, నర్సాపూర్‌, గురుదోట్ల, అంపల్లిల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నాగారం బీఆర్‌ఎస్‌క నాయకులు, మైనార్టీలు పీఏసీఎస్‌ మాజీ చెర్మన్‌ జె.హన్మంత్‌రెడ్డి, స్పీకర్‌ సమక్షంలో పార్టీలో చేరారు.

కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం

పూడూరు/పెద్దేముల్‌/యాలాల : కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి అన్నారు. పూడూరు మండలం అంగడిచిట్టెంపల్లి, చిట్టెంపల్లి, పోతిరెడ్డిగూడ, మన్నెగూడ, ఎన్కెపల్లి, చీలాపూర్‌, గొంగుపల్లి, కొత్తపల్లి, తిమ్మాపూర్‌, మిర్జాపూర్‌, బాకాపూర్‌, సోమన్‌గుర్తి, కేరవెల్లి, దేవినోనిగూడ, సిరిగాయపల్లి, మేడికొండ గ్రామాల్లో ప్రచారం చేశారు. ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనో హర్‌రెడ్డిలు పెద్దేముల్‌ మండలం ఆడ్కిచర్ల, బాయిమీదితండా, ఊరెంటితండా, పాషాపూర్‌లో ప్రచారం చేశారు. జడ్పీటీసీ ధారాసింగ్‌ పాల్గొన్నారు. కోకట్‌ బీఆర్‌ఎస్‌ నాయకులు కాంగ్రె స్‌లో చేరారు. మాణిక్యం, బాలప్ప పార్టీలో చేరారు. యాలాల మండలం అక్కంపల్లి మాజీ సర్పంచ్‌ లక్ష్మీ నారాయణ, జుంటుపల్లి మాజీ సర్పంచ్‌ నర్సిములు దాదాపు 500 మంది కార్యకర్తలు మనోహర్‌ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.

కాంగ్రెస్‌తోనే అభివృద్ధి : తాండూరు ఎమ్మెల్యే

తాండూరు రూరల్‌/మోమిన్‌పేట్‌/ధారూరు/కులకచర్ల/పరిగి : తాండూరు మండలం సిరిగిరిపేట్‌, కోటబాస్పల్లి, జినుగుర్తిలో పార్టీ సమావేశాలు నిర్వహించారు. ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి మాట్లాడారు. రంజిత్‌రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఎన్నికల ఇన్‌చార్జి మహేష్‌, సంపత్‌కుమార్‌, కె. పురుషోత్తంరావు, మండలాధ్యక్షుడు నాగప్పలు పాల్గొన్నారు. రంజిత్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని మోమిన్‌పేట మండలాధ్యక్షుడు శంకర్‌యాదవ్‌ కోరారు. మండల కేంద్రంతో పాటు మొరంగపల్లి తదితర గ్రామాల్లో ప్రచారం చేశారు. కాంగ్రెస్‌కు మంచి మెజార్టీ ఇవ్వడం జరుగుతుందని కాంగ్రెస్‌ వికారాబాద్‌ పట్టణాధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని అనంతగిరిపల్లిలో ఇంటింటి ప్రచారం చేశారు. ప్రచా రంలో కౌన్సిలర్‌ దేవి రెడ్యానాయక్‌, మురళి, హఫీజ్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు. కులకచర్ల మండలం చెల్లాపూర్‌, హన్మ్యానాయక్‌ తండాల్లోఅఖిల భారత బంజార సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు రాహుల్‌నాయక్‌ ఆధ్వర్యంలో ప్రచారం చేశారు. రంజిత్‌రెడ్డిని గెలిపించాలని పరిగి మండలాధ్యక్షుడు బి.పరుశరాంరెడ్డి కోరారు. ప్రచారంలో తావుర్యానాయక్‌, అశోక్‌, బి. నర్సింహులు, పాల్గొన్నారు. మోదీ పాలనలో రైతులు, బీసీలు, మైనార్టీల పరిస్థితి ఆందోళనకరంగా తయారైందని తెలంగాణ రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీహరిరావు, మైనార్టీ సెల్‌ రాష్ట్ర అఽధ్యక్షుడు ఫకృద్దీన్‌, డీసీసీ అధ్యక్షుడు టి.రామ్మోహన్‌రెడ్డి, బీసీ సంఘం రాష్ట్ర కన్వీనర్‌ ఎం.లాల్‌కృష్ణ ప్రసాద్‌లు ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం రాత్రి పరిగిలోని ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి నివాసంలో విలేకరులతో మాట్లాడారు. డీసీసీ ఉపా ధ్యక్షుడు కె.కృష్ణారెడ్డి, నాయకులు డి.అశోక్‌ పాల్గొన్నారు. సరూర్‌నగర్‌లో బడంగ్‌పేట్‌ మేయర్‌ చిగిరింత పారిజాతానర్సింహారెడ్డి రంజిత్‌రెడ్డి తరఫున ప్రచారం చేశారు. బడంగ్‌పేట్‌ కార్పొరేషన్‌ రంగనాయకుల కాలనీకి చెందిన బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు బడంగ్‌పేట్‌ మునిసిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ చిగిరింత నర్సింహారెడ్డి సమక్షంలో హస్తం గూటికి చేరారు.

Updated Date - May 09 , 2024 | 12:45 AM