Share News

ధాన్యం కొనుగోళ్ల జాప్యంపై కలెక్టర్‌ సీరియస్‌

ABN , Publish Date - Apr 27 , 2024 | 12:40 AM

ధాన్యం కొనేదేప్పుడు?’ శీర్షికన వరి రైతుల ఇబ్బందులపై ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కఽథనంతో జిల్లా అధికారుల్లో కదలిక వచ్చింది.

ధాన్యం కొనుగోళ్ల జాప్యంపై కలెక్టర్‌ సీరియస్‌
మెట్లకుంట కేంద్రం వద్ద వడ్ల తేమశాతాన్ని పరిశీలిస్తున్న డీఎం సుగుణాబాయి, డీఎ్‌సవో రాజేశ్వర్‌

ప్రక్రియ వేగం పెంచాలని అధికారులకు ఆదేశం

కేంద్రాలను పరిశీలించిన సివిల్‌ సప్లయీస్‌ అధికారులు

జిల్లాలో 129 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాం

కొనుగోళ్లు ముమ్మరం8 రైతులను ఇబ్బందులు పెడితే ఏజెన్సీలపై చర్యలు

పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్‌ సుగుణాబాయి

ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్‌

పరిగి, ఏప్రిల్‌ 26: ‘ధాన్యం కొనేదేప్పుడు?’ శీర్షికన వరి రైతుల ఇబ్బందులపై ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కఽథనంతో జిల్లా అధికారుల్లో కదలిక వచ్చింది. కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఆంధ్రజ్యోతి కథనంలో ప్రస్తావించిన అంశాలపై ఆరాతీశారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై అధికారులపై ఆయన సీరియసయ్యారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి, కొనుగోళ్లను వేగవంతం చేయాలని పౌరసరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. పౌరసరఫరాల జిల్లా మేనేజర్‌ ఎల్‌.సుగుణాబాయి, అధికారి రాజేశ్వర్‌, తదితరులు పరిగి, బొంరా్‌సపేట్‌ మండలాల్లో పర్యటించారు. మెట్లకుంట, బొంరాసిసేట్‌, నాగిరెడ్డిపల్లి, పరిగి కేంద్రాల్లో పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పోసిన వడ్ల కుప్పలను పరిశీలించారు. మేనేరజర్‌ సుగుణాబాయి ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. జిల్లాలో వివిధ ఏజెన్సీల ద్వారా 129వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామన్నారు. ధాన్యం ఎఫ్‌ఏక్యూ నిబంధనలకు మేరకు ఉంటేనే కొనుగోలు చేస్తామన్నారు. కేంద్రాల్లో ప్యాడీ క్లీనర్లు, మాయిశ్చర్‌ మీటర్‌ ద్వారా ప్రాసెస్‌ చేసుకునేందుకు అవకాశచ్చామని తెలిపారు. జిల్లాలో 12.4లక్షల క్వింటాళ్ల ధాన్యాన్ని కొనాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. శుక్రవారం నుంచే జిల్లాలోని అన్ని కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయన్నారు. 29లక్షల గన్నీ బ్యాగులు అవసరముండగా, కేంద్రాల్లో 15లక్షల బ్యాగ్‌లు ఉన్నాయని చెప్పారు. మరో 6లక్షల బ్యాగ్‌లకు ఆర్డర్లు ఇచ్చామని, రెండు రోజుల్లో అవసరం మేరకు గన్నీ బ్యాగులొస్తాయని చెప్పారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అన్ని వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. తూకం మిషన్లు, టార్పాలిన్లు, మాయిశ్చర్‌ మీటర్లు, ప్యాడీ క్లీనర్లు, లైటింగ్‌ తదితర సదుపాయాలు కల్పిస్తున్నట్లు వివరించారు. ఏ కేంద్రంలో అయినా బ్యాగులు చిరిగిపోయినా వాటి స్థానంలో కొత్తవి ఇస్తామన్నారు. రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మి మద్దతు ధర పొందాలని సూచించారు. రైతులు వడ్లు కాంటా పెట్టిన వారంరోజుల్లోనే వారి ఖాతాల్లో డబ్బులు జమచేస్తామని తెలిపారు.

Updated Date - Apr 27 , 2024 | 12:40 AM