Share News

సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తా

ABN , Publish Date - May 09 , 2024 | 12:17 AM

తనను ఎంపీగా గెలిపిస్తే భువనగిరి పార్లమెంట్‌ పరిధిలోని పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తానని బీజేపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్‌ నర్సయ్యగౌడ్‌ అన్నారు. బుధవారం మోత్కూరులోని బీజేపీ ఎన్నికల కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తా

హైదరాబాదులో భువనగిరి భవన్‌ నిర్మాణానికి కృషి

బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌

మోత్కూరు, గుండాల, ఆలేరురూరల్‌, మే 8: తనను ఎంపీగా గెలిపిస్తే భువనగిరి పార్లమెంట్‌ పరిధిలోని పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తానని బీజేపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్‌ నర్సయ్యగౌడ్‌ అన్నారు. బుధవారం మోత్కూరులోని బీజేపీ ఎన్నికల కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో భువనగిరి నియోజకవర్గం నుంచి తనను గెలిపిస్తే ఢిల్లీలో తెలంగాణ భవన్‌ ఉన్నట్లుగా హైదరాబాదులో భువనగిరి భవన్‌ నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. 2014లో ఎంపీగా గెలిచిన తాను కేంద్రం నుంచి సుమారు రూ.9 వేల కోట్ల నిధులు తెచ్చి భువనగిరి ప్రాంతంలో పలు అభివృద్ధి పనులు చేశానని వివరించారు. తనను గెలిపిస్తే నియోజక వర్గంలో పారిశ్రామిక వాడ, ఐటీ హబ్‌, రాచకొండ గుట్టలను పర్యాటక కేంద్రంగా, సాగు నీటి ప్రాజెక్టుల పూర్తి, స్కిల్‌ డెవలప్‌ సెంటర్‌, మూసీ ప్రక్షాళన తదితర పనులు పూర్తి చేసేందుకు కృషి చేస్తానన్నారు. గుండాల బీజేపీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్‌ అభ్యర్థి ప్రజలకు ఎలాంటి హామీ ఇవ్వకుండా ఎన్నికల ప్రచారం చేస్తున్నారని చెప్పారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఊట్కూరు అశోక్‌రెడ్డి, తుంగతుర్తి నియోజకవర్గ కన్వీనర్‌ కాప రవి, కోకన్వీనర్‌ కూరాకుల వెంకన్న, నాయకులు కొణతం నాగార్జునరెడ్డి, దొంతి నర్సింహారెడ్డి, గౌరు శ్రీనివాస్‌, చాడ మంజుల, దీటి సందీప్‌, మధుసూదన్‌, సజ్జనం మనోహర్‌, గుంటి సతీష్‌, రాము, ఆలేరు నియోజకవర్గ ఇన్‌చార్జి పడాల శ్రీనివాస్‌, నాయకులు బండ రమేశ్‌రెడ్డి, మల్లేశ్‌, మలిపెద్ది యాదిరెడ్డి, మాధవరెడ్డి ఆయన వెంట ఉన్నారు.

ప్రజలు తగిన బుద్ధి చెప్పాలి

బ్లాక్‌ మెయిల్‌ రాజకీయాలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని బూర నర్సయ్య గౌడ్‌ అన్నారు. బుధవారం ఆలేరులో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో బీజేపీ 12 స్థానాల్లో గెలవబోతుందన్నారు. సమావవేంలో బీజేపీ రాష్ట్ర, జిల్లా, మండల పట్టణ నాయకులు వట్టిపల్లి శ్రీనివాస్‌, పడాల శ్రీనివాస్‌, సిరిగే శ్రీనివాస్‌, బడుగు జహంగీర్‌, కుమార్‌, గంగేష్‌, తదితరులు ఉన్నారు.

Updated Date - May 09 , 2024 | 12:17 AM