Share News

ఆయకట్టును ఎండబెట్టిన అసమర్ధ మంత్రులు

ABN , Publish Date - Apr 29 , 2024 | 12:15 AM

రాష్ట్రం ఏర్పడి అనేక కష్టనష్టాలు పడి రైతాంగా న్ని ఆదుకుంటే కాంగ్రెస్‌ అసమర్ధ ప్రభు త్వం రైతులను, ప్రజలను ఆదుకోలేకపోయిందని మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు.

ఆయకట్టును ఎండబెట్టిన అసమర్ధ మంత్రులు

మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి

నడిగూడెం, ఏప్రిల్‌ 28: రాష్ట్రం ఏర్పడి అనేక కష్టనష్టాలు పడి రైతాంగా న్ని ఆదుకుంటే కాంగ్రెస్‌ అసమర్ధ ప్రభు త్వం రైతులను, ప్రజలను ఆదుకోలేకపోయిందని మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. ఆదివారం బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డిని గెలిపించాల ని కోరుతూ నడిగూడెంలో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సాగర్‌ నీటిని 18 పంటలకు ఇచ్చి రైతులను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కాపాడుకుంటే, రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చెరువులను, పంటలను ఎండబెట్టిందన్నారు. షాదీముబారక్‌, కల్యాణ లక్ష్మి, పెన్షన్లు పెంచి ఇస్తామని అధికారంలోకి వచ్చి వాటిని మరచిపోయారన్నారు. జిల్లాలోని ప్రాజెక్టులన్నింటిని ఎండబెట్టారని, తెలిసో తెలియకో కాంగ్రె్‌సకు ఓటు వేశారని ప్రజలు ఇప్పడు బాధపడుతున్నారన్నారు. ఇకనైనా మేల్కొని బీఆర్‌ఎ్‌సను ఆదరించి, కేసీఆర్‌ నాయకత్వంలో సమస్యలపై ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు. పార్లమెంటు అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి మాట్లాడుతూ, తనను ఆశీర్వదించి ఎంపీగా గెలిపిస్తే గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రజా సమస్యలపై పోరాడతానన్నారు. కార్యక్రమంలో కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌, ఎంపీపీ యాతాకుల జ్యోతి, పార్టీ మండల అధ్యక్షుడు పల్లా నర్సిరెడ్డి, మాజీ జడ్పీటీసీ మారుతి ఉపేందర్‌, దున్నా సుధాకర్‌, ఆనంతుల మహేష్‌, గంగారాజు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 29 , 2024 | 12:15 AM