Share News

హోరాహోరీగా ఎడ్ల పందేలు

ABN , Publish Date - Apr 29 , 2024 | 12:18 AM

మండల కేంద్రంలోని శుభవార్త చర్చి వార్షికోత్సవం సందర్భంగా స్థానిక శుభోదయ యువజన సంఘం ఆధ్వర్యంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న తెలుగు రాష్ట్రాల స్థాయి ఎడ్ల పందేలు హోరాహోరీగా సాగుతున్నాయి.

హోరాహోరీగా ఎడ్ల పందేలు

తిలకించేందుకు తరలివచ్చిన తెలుగు రాష్ట్రాల ప్రజలు

మఠంపల్లి, ఏప్రిల్‌ 28: మండల కేంద్రంలోని శుభవార్త చర్చి వార్షికోత్సవం సందర్భంగా స్థానిక శుభోదయ యువజన సంఘం ఆధ్వర్యంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న తెలుగు రాష్ట్రాల స్థాయి ఎడ్ల పందేలు హోరాహోరీగా సాగుతున్నాయి. ఆదివారం జరిగిన పోటీల్లో మొత్తం 10జతలు పాల్గొన్నాయి. పోటీలను తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలు తరలివచ్చారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి తాగునీరు, వసతి, భోజన సదుపాయాలను కల్పించినట్టు, ఎండ తీవ్రత దృష్ట్యా సాయంత్రం 6గంటల నుంచి అర్ధరాత్రి వరకు పోటీలు నిర్వహిస్తున్నట్టు యువజన సంఘం అధ్యక్షుడు గాదె జయభరత్‌రెడ్డి తెలిపారు. కాగా, పోటీలను తిలకించేందుకు రెండు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు, ప్రజలు తరలిరావడంతో వీవీ.మైదానం కోలాహలంగా మారింది. కార్యక్రమంలో ఫాదర్‌ వినోద్‌రెడ్డి, ఆధూరి మధుసూదన్‌రెడ్డి, శౌరెడ్డి, బాల్‌రెడ్డి, కె.చిన్నపురెడ్డి, భాస్కర్‌రెడ్డి, బాలశౌరెడ్డి, గాదె పవన్‌రెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి, సిస్టర్‌ రూబీ, సుజాత, అలం బాల్‌రెడ్డి, అంథోనిరెడ్డి, లూర్ధురెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఆరు పండ్ల విభాగంలో మఠంపల్లి గిత్తలకు ప్రథమస్థానం

తెలుగు రాష్ట్రాల స్థాయి ఎడ్ల పందేల్లో ఆరు పండ్ల విభాగంలో మం డల కేంద్రానికి చెందిన తుమ్మా కిరణ్‌కుమార్‌రెడ్డి గిత్తలు 3319.7 అడుగులు లాగి ప్రథమ బహుమతి గెలుచుకున్నాయి. ఏపీ రాష్ట్రం కృష్ణా జిల్లా, గన్నవరం మండలం, తెంపల్లికి చెందిన గుదిబండి వెంకటరెడ్డి, జొన్నలగడ్డ గిత్తలు రెండో బహుమతి, పామర్రుకు చెందిన గుంటూరు బలికోటయ్యగిత్తలు మూడో బహుమతి, మఠంపల్లికి చెందిన గాదె ఆషీర్‌రెడ్డి, సుమన్విరెడ్డికి చెందిన గిత్తలు నాలుగో బహుమతి గెలుచుకున్నా యి.ప్రకాశం జిల్లా, ముండ్లమూరు మండలం, మర్కేనవారిపాలెంకు చెందిన గోడుగూలురి రామయ్య గిత్తలు ఐదో బహుమతి, గుంటూరు జిల్లా,పెదకాకాని మండలానికి చెందిన మంచికలపూడి పద్మావతి గిత్త లు ఆరో బహుమతి, నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం, నడికుడ కు చెందిన రఘుగౌడ్‌ గిత్తలు ఏడో బహుమతి గెలుచుకున్నాయి.

Updated Date - Apr 29 , 2024 | 12:18 AM