Share News

అడ్డగూడూరులో నెగ్గిన అవిశ్వాసం

ABN , Publish Date - May 09 , 2024 | 12:41 AM

అడ్డగూడూరు సింగిల్‌ విండో చైర్మన పొన్నాల వెంకటేశ్వర్లుపై సింగిల్‌ విండో డైరెక్టర్లు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం నెగ్గిందని డీసీవో ప్రవీణ్‌కూమార్‌ తెలిపారు.

అడ్డగూడూరులో నెగ్గిన అవిశ్వాసం

క్యాంపు నుంచి నేరుగా కార్యాలయానికి చేరుకున్న డైరెక్టర్లు

అడ్డగూడూరు, మే 8: అడ్డగూడూరు సింగిల్‌ విండో చైర్మన పొన్నాల వెంకటేశ్వర్లుపై సింగిల్‌ విండో డైరెక్టర్లు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం నెగ్గిందని డీసీవో ప్రవీణ్‌కూమార్‌ తెలిపారు. బుధవారం అడ్డగూడూరు సింగిల్‌ విండో కార్యాలయంలో అవిశ్వాసంపై ఓటింగ్‌ నిర్వహించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. చైర్మన వెంకటేశ్వర్లుపై అవిశ్వాసం ప్రకటిస్తూ జనవరి 22న 2024న తొమ్మిది మంది డైరెక్టర్లు భువనగిరి డీసీవో ప్రవీణ్‌ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఫిబ్రవరి 12న ఓటింగ్‌ నిర్వహించేందకు డీసీవోను ప్రిసైడింగ్‌ అధికారిగా నియమించారన్నారు. ఓటింగ్‌ నిర్వహించేందుకు సమావేశం ఏర్పాటు చేయగా 13 మందికి 10మంది డైరెక్టర్లు హాజరుయ్యారన్నారు. అవిశ్వాస తిర్మానానికి అనుకూలంగా 10 మంది చేతులెత్తినప్పటీకి అప్పటి చైర్మన పొన్నాల వెంకటేశ్వర్లు హైకోర్టులో పిటిషన దాఖాలు చేయగా స్టే ఆర్డరు రావడంతో ఆ ఫలితం ప్రకటించలేదు. అవిశ్వాసం ఏర్పాటు చేసి ఆ ఫలితాన్ని కోర్టుకు అందించినట్లు డీసీవో తెలిపారు. ఇటీవల కోర్టు మార్గ దర్శకాల ప్రకారం కోర్టు తీర్పు అవిశ్వాస తీర్మాణానికి అనుకూలంగా తీర్పు వెలువడడంతో బుధవారం సింగిల్‌ విండో కార్యాలయంలో డీసీవో ప్రవీణ్‌కుమార్‌ సమావేశం ఏర్పాటు చేయగా 13 మంది డైరెక్టర్లకు గాను 9 మంది డైరక్టర్లు హాజరై కొప్పుల నిరంజన రెడ్డికి మద్దతుగా చేతులు ఎత్తడంతో నూతన చైర్మనగా చిన్నపడిశాల గ్రామానికి చెందిన కొప్పుల నిరంజన ఎన్నికైనట్లు ఆయన తెలిపారు.

Updated Date - May 09 , 2024 | 12:41 AM