Share News

కాంగ్రె్‌సది ప్రజాపాలన

ABN , Publish Date - Apr 29 , 2024 | 12:12 AM

కేసీఆర్‌ నాయకత్వంలోని బీఆర్‌ఎ్‌సది ఫా మ్‌హౌస్‌ పాలన అయితే రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రె్‌సది ప్రజాపాలన అని భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి, ము నుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు.

కాంగ్రె్‌సది ప్రజాపాలన

భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి రాజగోపాల్‌రెడ్డి

బీబీనగర్‌,ఏప్రిల్‌ 28: కేసీఆర్‌ నాయకత్వంలోని బీఆర్‌ఎ్‌సది ఫా మ్‌హౌస్‌ పాలన అయితే రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రె్‌సది ప్రజాపాలన అని భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి, ము నుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి మండల కేంద్రంలో భువనగిరి పార్లమెంట్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి చామల కిరణ్‌ కుమార్‌రెడ్డికి మద్దతుగా ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌ రెడ్డితో కలిసి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం పోచంపల్లి చౌరస్తా లో నిర్వహించిన కార్నర్‌ మీటింగ్‌లో రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ, పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలన పాముల పుట్ట కదులుతోందన్నారు. అధికారా న్ని అడ్డం పెట్టుకుని కేసీఆర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుని పార్టీని బొంద పెట్టాలనుకున్నారని, ప్రస్తుతం అదే కాంగ్రెస్‌ బీఆర్‌ఎ్‌స ను, కేసీఆర్‌ను బొంద పెట్టనుందన్నారు. కవిత లిక్కర్‌ స్కాంలో చిక్కుకుని జైలుపాలైతే కాపాడుకోలేని కేసీఆర్‌, సిగ్గు లేకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారని విమర్శించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ ద్వారా కాం గ్రెస్‌ నేతల ఫోన్లను ట్యాప్‌ చేసి అనేక రకాలుగా ఇబ్బందులకు, బెదిరింపులకు గురి చేశారని, అదే ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం కేసీఆర్‌ కుటుంబానికి ఉరితాడై చుట్టుకోనున్నదన్నారు. ప్రాజెక్టుల పేరుతో కుంభకోణానికి పాల్పడ్డారని, నాసిరకంగా నిర్మించిన ప్రాజెక్టులు కుంగిపోతున్నాయని, ఈ పాపం ఎవరిదని ప్రశ్నించారు. భువనగిరి పార్లమెంట్‌ కాం గ్రెస్‌ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం కాంగ్రెస్‌ శ్రేణులపై ఉందన్నారు. కుంభం, తాను పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థికి మెజార్టీ తీసుకురావడంలో పో టీ పడతామన్నారు. మునుగోడు నియోజకవర్గం నుంచి ఎక్కువ మెజార్టీని వస్తే సీఎం రేవంత్‌రెడ్డిని ఒప్పించి నియోజకవర్గ అభివృద్ధికి రూ.100కోట్ల నిధులు తీసుకువస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కాం గ్రెస్‌ అధికారంలో ఉన్నందున ఎంపీగా తనను గెలిపిస్తే పార్లమెంట్‌ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని చామల కిరణ్‌ కుమార్‌రెడ్డి అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల ప్రాతిపదికన సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని, ఉద్యమ నేతగా అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు. ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ, ఎమ్మెల్యేగా గెలిపించిన నియోజకవర్గ ప్రజలు ఎంపీ అభ్యర్థికి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ముందు ప్రజలకు కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తుందన్నారు. రైతు రుణమాఫీ కూడా ఆగస్టు 15లోపు అమలుకు సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారని అన్నారు. కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్మన్‌ కసిరెడ్డి నారాయణరెడ్డి, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు సురకంటి సత్తిరెడ్డి, నాయకులు గోళి పింగల్‌రెడ్డి, పొట్టోళ్ల శ్యాంగౌడ్‌, పంజాల రామాంజనేయులు గౌడ్‌, నరేందర్‌రెడ్డి, పోత్నక్‌ ప్రమోద్‌కుమార్‌, బస్వ య్య, ఆగమయ్యగౌడ్‌, లక్ష్మయ్య, పెంటయ్యగౌడ్‌, వేణుగౌడ్‌, పాల్గొన్నారు.

Updated Date - Apr 29 , 2024 | 12:13 AM