Share News

సరిహద్దులో పకడ్బందీగా తనిఖీలు నిర్వహించాలి

ABN , Publish Date - Apr 29 , 2024 | 12:17 AM

సరిహద్దులో పకడ్బందీగా తనిఖీలు నిర్వహించాలని ఎన్నికల పరిశీలకుడు కళ్యాణ్‌కుమార్‌దాస్‌ అన్నారు. ఆదివారం మండల పరిధిలోని రా మాపురం క్రాస్‌రోడ్డు వద్ద రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టును తనిఖీ చేశారు.

సరిహద్దులో పకడ్బందీగా  తనిఖీలు నిర్వహించాలి

ఎన్నికల పరిశీలకుడు కళ్యాణ్‌కుమార్‌దాస్‌

కోదాడ రూరల్‌, ఏప్రిల్‌ 28: సరిహద్దులో పకడ్బందీగా తనిఖీలు నిర్వహించాలని ఎన్నికల పరిశీలకుడు కళ్యాణ్‌కుమార్‌దాస్‌ అన్నారు. ఆదివారం మండల పరిధిలోని రా మాపురం క్రాస్‌రోడ్డు వద్ద రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టును తనిఖీ చేశారు. ఎన్నికలకు సమ యం దగ్గర పడుతున్నందున ఏపీరాష్ట్రంనుంచి వచ్చే వాహనాలను తనిఖీ చేయాలని పో లీసులను ఆదేశించారు. ఇప్పటి వరకు ఎంత నగదు స్వాధీనం చేసుకున్నారని అధికారులను అడిగి తెలుసుకున్నారు. నగదుతో పాటు ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే వస్తువులను స్వాధీనం చేసుకున్న వివరాలను తెలుసుకున్నారు. వాటి వివరాలను రికార్డులో న మోదు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ రాష్ట్రం నుంచి వచ్చే వాహ నాలను క్షుణ్ణంగా తనిఖీ చేశాకే అనుమతించాలన్నారు. నగదుకు సంబంధించిన ఆధారా లు చూపకపోతే సీజ్‌ చేయాలన్నారు. మద్యం కూడా సరఫరా అయ్యే అవకాశం ఉన్నందున వాటిపై నిఘా పెంచాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో సూర్యనారాయణ, తహసీల్దా ర్‌ సాయిగౌడ్‌, రెవెన్యూ, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

ఓటింగ్‌ శాతం పెరిగేలా చూడాలి

నేరేడుచర్ల, గరిడేపల్లి: పార్లమెంటు ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం పెరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఎన్నికల పరిశీలకుడు మనోజ్‌కుమార్‌ మాణిక్‌రావు సూర్యవంశీ ఆదేశించారు. ఆదివారం నేరేడుచర్ల, గరిడేపల్లి మండలం కేంద్రాల్లోని పలు పోలిం గ్‌ కేంద్రాలను ఆయన తనిఖీచేశారు. పోల్‌ చిట్టీల పంపిణీ, ఓటర్ల నమోదు వంటి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల సమయంలో పకడ్బందీగా విధు లు నిర్వహించాలన్నారు. చిల్లేపల్లి చెక్‌పోస్టును తనిఖీ చేసి ప్రతీ వాహనాన్ని తనిఖీ చేయాలని ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దార్లు సైదులు, బండ కవిత, మునిసిపల్‌ కమిషనర్‌ అశోక్‌రెడ్డి, వీఆర్వో రాంబాబు, బీఎల్‌వోలు ఉన్నారు.

Updated Date - Apr 29 , 2024 | 12:17 AM