Share News

సుల్తాన్‌పూర్‌ జేఎన్టీయూలో టెక్నికల్‌ డే

ABN , Publish Date - Apr 26 , 2024 | 11:25 PM

పుల్‌కల్‌, ఏప్రిల్‌ 26: చౌటకూర్‌ మండలం సుల్తాన్‌పూర్‌ జేఎన్టీయూ ఇంజనీరింగ్‌ కళాశాలలో సివిల్‌ డిపార్ట్‌మెంట్‌ అధ్వర్యంలో 12వ టెక్నికల్‌ డే శుక్రవారం ప్రారభమయ్యాయి. ఈ ఉత్సవాలను కళాశాల ప్రిన్సిపాల్‌ జి.నరసింహ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.

సుల్తాన్‌పూర్‌ జేఎన్టీయూలో టెక్నికల్‌ డే
బయో మెడికల్‌ వేస్టేజ్‌ ప్లాంట్‌ను పరిశీలిస్తున్న ప్రిన్సిపాల్‌ నరసింహ, సివిల్‌ డిపార్ట్‌మెంట్‌ హెచ్‌వోడీ శ్రీనివాసులు

పుల్‌కల్‌, ఏప్రిల్‌ 26: చౌటకూర్‌ మండలం సుల్తాన్‌పూర్‌ జేఎన్టీయూ ఇంజనీరింగ్‌ కళాశాలలో సివిల్‌ డిపార్ట్‌మెంట్‌ అధ్వర్యంలో 12వ టెక్నికల్‌ డే శుక్రవారం ప్రారభమయ్యాయి. ఈ ఉత్సవాలను కళాశాల ప్రిన్సిపాల్‌ జి.నరసింహ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఇంజనీరింగ్‌ కళాశాల వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతీఏటా నిర్వహించే ఈ ఉత్సవాలు రెండురోజుల పాటు జరుగనున్నాయి. కళాశాలలో వివిధ విభాగాలకు చెందిన విద్యార్థులు ఏడాదిపాటు చదువుకున్న తమ తమ డిపార్ట్‌మెంట్లకు సంబంధించి ప్రాజెక్టుల రూపంలో తయారుచేసి ప్రదర్శనలు ఇవ్వనున్నారు. అతి తక్కువ ఖర్చుతో సోలార్‌ విద్యుత్‌తో వ్యవసాయం చేయడం వల్ల ఒనగూరే ప్రయోజనాలను విద్యార్థులు తయారు చేసి నమూనాల ద్వారా అధ్యాపక సిబ్బందికి వివరించారు. ఇందులో భాగంగా అభివృద్ధి చెందిన దేశాల్లో రవాణా వ్యవస్థ, ట్రాఫిక్‌ సిగ్నల్‌, హైడ్రాలిక్‌ రొటేటింగ్‌ బ్రిడ్జి, వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌, వ్యర్థ పదార్థాలలో ఒకటైన బయోమెడికల్‌ వేస్టేజ్‌ ప్లాంట్‌ వల్ల కలిగే నష్టాలు, లాభాలను వివరించారు. వేస్టేజ్‌ నుంచి ఏర్పడే వాయువు (గ్యాస్‌) ఎలా తగ్గించాలో విద్యార్థులు తయారుచేసి ప్రదర్శించారు. నేటి యువత నేటి భారతదేశానికి నాంది కావాలని ప్రిన్సిపాల్‌ జి.నరసింహ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వివిధ డిపార్ట్‌మెంట్‌ అధిపతులు, సివిల్‌ ఇంజనీరింగ్‌ డిపార్ట్‌మెంట్‌ అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Apr 26 , 2024 | 11:25 PM