Share News

త్వరలో పోడు భూములకు పట్టాలు

ABN , Publish Date - Apr 28 , 2024 | 11:16 PM

గిరిజన తండాల లో ఉన్న పోడుభూములకు త్వరలో పట్టాలిస్తామ ని నాగర్‌ కర్నూల్‌ ఎంపీ అభ్యర్థి మల్లు రవి అ న్నారు.

 త్వరలో పోడు భూములకు పట్టాలు
అక్కారం గ్రామంలో ప్రచారంలో పాల్గొన్న ఎంపీ అభ్యర్థి మల్లు రవి, ఎమ్మెల్యే వంశీకృష్ణ

- నాగర్‌కర్నూల్‌ ఎంపీ అభ్యర్థి మల్లు రవి

అచ్చంపేటటౌన్‌, ఏప్రిల్‌ 28: గిరిజన తండాల లో ఉన్న పోడుభూములకు త్వరలో పట్టాలిస్తామ ని నాగర్‌ కర్నూల్‌ ఎంపీ అభ్యర్థి మల్లు రవి అ న్నారు. ఆదివారం మండల పరిధిలోని బక్కలింగా య్యపల్లి, అక్కారం, ఆంజనేయతండా, ఘనపూర్‌, మన్నేవారిపల్లి, సిద్దాపూర్‌, బొమ్మన్‌పల్లి, చందా పూర్‌, నడింపల్లి, హాజిపూర్‌ గ్రామాల్లో పార్లమెం ట్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన గ్రామాల్లో రోడ్‌ షోలలో మాట్లా డారు. నల్లమల ప్రాంతంలోని గిరిజనుల పోడు భూములకు పట్టాలిచ్చి తీరుతామన్నారు. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో పోడు భూములకు పట్టాలిచ్చామని, మళ్లీ అదే తరహాలో ఇస్తామని గిరిజనులకు హామీ ఇచ్చారు. నల్లమలలో లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ఏర్పాటు చేసి ప్రతీ ఎకరాకు సాగు నీరందిస్తామన్నారు. ఇల్లు లే ని వాళ్లందరికి డబూల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇచ్చి తీరు తామన్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడిన కొన్ని రోజుల్లోనే మహిళలకు అండగా నిలిచి ఉచిత బ స్సు ప్రయాణంతో పాటు రూ 500లకే గ్యాస్‌ సి లిండర్‌ అందించిన ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వాని దన్నారు. ప్రతీ ఒక్కరు కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వే యాలని కోరారు. నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ అభ్య ర్థి మల్లు రవిని గెలిపించి దేశంలో రాహుల్‌ గాంధీని ప్రధానమంత్రి చేయాలని ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలకు ,రైతుల కు పెద్ద పీట వేస్తోందన్నారు. మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం కల్పించి మహిళల కు అండగా నిలిచిందన్నారు. అదేవిధంగా రైతులకు నాణ్యమైన 24గంటల కరెంట్‌ అందిస్తున్నామన్నారు. త్వరలో ముఖ్యమం త్రి చెప్పినట్టుగా రైతులు తీపికబురు వింటార న్నారు. రైతులకు అండగా నిలుస్తూ వరికి మ ద్దతు ధరతో పాటు బోనస్‌ అందించనున్నట్లు తె లిపారు. ప్రతీ ఒక్కరు కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేసి పార్లమెంట్‌ అభ్యర్థి మల్లు రవిని గెలిపించాలని కోరారు. నాయకులు రామనాథం, గోపాల్‌ రెడ్డి, రాజేందర్‌, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 28 , 2024 | 11:16 PM