Share News

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు

ABN , Publish Date - Apr 28 , 2024 | 11:32 PM

పార్లమెంట్‌ ఎన్నికల కోడ్‌ ముగియగానే నియోజకవర్గంలోని అర్హులైన ప్రతీ నిరుపేదకు ఇందిరమ్మ ఇళ్లు పథకం అందిస్తామని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు.

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
ఎన్నికల ప్రచారంలో భాగంగా మహిళలను ఓటు అడుగుతున్న ఎమ్మెల్యే మేఘారెడ్డి

- వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

వనపర్తి టౌన్‌, ఏప్రిల్‌ 28: పార్లమెంట్‌ ఎన్నికల కోడ్‌ ముగియగానే నియోజకవర్గంలోని అర్హులైన ప్రతీ నిరుపేదకు ఇందిరమ్మ ఇళ్లు పథకం అందిస్తామని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. గుడ్‌ మార్నింగ్‌ వనపర్తి కార్యక్రమంలో భాగంగా ఆదివారం పట్టణంలోని 5వ, 20వ వార్డుల్లో ఆయన పర్యటించారు. ఇంటింటికి తిరిగి పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేసి డాక్టర్‌ మల్లు రవిని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 3,500 ఇందిరమ్మ ఇళ్లను కేటాయించారని అన్నారు. అదేవిధంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రకటించిన గ్యారెంటీలను అర్హులందరికీ అందిస్తామని అన్నారు. కార్యక్రమంలో డాక్టర్‌ పగిడాల శ్రీనివాస్‌రెడ్డి, మునిసిపల్‌ చైర్మన్‌ పుట్టపాకల మహేష్‌, వైస్‌ చైర్మన్‌ పాకనాటి కృష్ణ, పట్టణ అధ్యక్షుడు చీర్ల చందర్‌, లక్కాకుల సతీష్‌, మునిసిపల్‌ కౌన్సిలర్లు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఆగారం గ్రామాన్ని ఆదర్శంగా మారుస్తా

ఖిల్లాఘణపురం : మండలంలోని ఆగారం గ్రామాన్ని దత్తత తీసుకుని ఆదర్శ గ్రామంగా మార్పు చేస్తానని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. మండలంలోని ఆగారం గ్రామానికి చెందిన రవికుమార్‌ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి 80 మంది కార్యకర్తలు ఆదివారం కాంగ్రెస్‌లో చేరారు. వారికి ఎమ్మెల్యే మేఘారెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గత పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో గ్రామం అభివృద్ధి సాధించలేదని, నేడు ఇందిరమ్మ రాజ్యంలో ఆగారం గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేసుకుందామని ప్రకటించారు. రాబోయే 15 రోజుల్లో నిర్వహించే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ అభ్యర్థి మల్లు రవిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ మండల నాయకులు సాయిచరణ్‌ రెడ్డి, మండల యూత్‌ అధ్యక్షుడు జయకర్‌, గ్రామ కమిటీ అధ్యక్షుడు కృష్ణయ్య, మాజీ సర్పంచ్‌ తెలుగు బాలయ్య, మాజీ ఉప సర్పంచ్‌ నరేష్‌, నాయకులు బాలకృష్ణారెడ్డి, సతీష్‌, రవికుమార్‌, శ్యాంసుందర్‌ రావు, రవి నాయక్‌, ఖాజామైనోద్దీన్‌, సాయిబాబు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 28 , 2024 | 11:32 PM