Share News

నాయకుడిగా కాదు.. సేవకుడిగా పనిచేస్తా

ABN , Publish Date - Apr 28 , 2024 | 11:32 PM

తనను ఎంపీగా గెలిపిస్తే నాయకుడిగా కాదు.. సేవకుడిగా పనిచేస్తానని కాంగ్రెస్‌ మహబూబ్‌నగర్‌ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డి అన్నారు.

నాయకుడిగా కాదు.. సేవకుడిగా పనిచేస్తా
జక్లేర్‌లో మాట్లాడుతున్న కాంగ్రెస్‌ మహబూబ్‌నగర్‌ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డి

- కాంగ్రెస్‌ మహబూబ్‌నగర్‌ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డి

మక్తల్‌, ఏప్రిల్‌ 28 : తనను ఎంపీగా గెలిపిస్తే నాయకుడిగా కాదు.. సేవకుడిగా పనిచేస్తానని కాంగ్రెస్‌ మహబూబ్‌నగర్‌ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం మక్తల్‌ మండలంలోని జక్లేర్‌, మంథన్‌గోడ్‌ గ్రామాల్లో నిర్వహించిన కార్నర్‌ మీటింగ్‌లో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరితో కలిసి మాట్లాడారు. కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగ భృతి, యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇందిరమ్మ పథకం కింద ఇండ్ల నిర్మాణానికి రూ.ఐదు లక్షల సాయం చేస్తామన్నా రు. 400ల సీట్లు వస్తే రాజ్యాంగంలో రిజర్వేషన్లు రద్దు చేసేందుకు కుట్రలు చేస్తుందన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అం దరిపై ఉందన్నారు. ఆగస్టు 15వ తేదీలోపు రైతు లకు రూ.రెండు లక్షల రుణ మాఫీతో పాటు ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను నెర వేర్చుతామన్నారు. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీలు కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నారని ప్రజలంతా అప్రమత్తంగా ఉండి కాం గ్రెస్‌ను గెలిపించాలన్నారు. కాంగ్రెస్‌ పార్టీతోనే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. కార్యక్రమంలో నారాయణపేట జడ్పీ చైర్‌పర్సన్‌ వనజ ఆంజనేయులు గౌడ్‌, కాంగ్రెస్‌ నాయకులు బాలకృష్ణారెడ్డి, మాదిరెడ్డి జలంధర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, గవినోళ్ల గోపాల్‌రెడ్డి, రవికుమార్‌ యాదవ్‌, గణేష్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 28 , 2024 | 11:32 PM