Share News

కాంగ్రెస్‌కు ఓటు వేస్తే రాష్ట్రం అంధకారం

ABN , Publish Date - Apr 28 , 2024 | 11:30 PM

పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీలకు ఓటు వేస్తే తెలంగాణ అంధకా రంగా మారుతుందని మా జీ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు.

కాంగ్రెస్‌కు ఓటు వేస్తే రాష్ట్రం అంధకారం
ఖిల్లాఘణపురంలో మహిళలతో మాట్లాడుతున్న నిరంజన్‌రెడ్డి

- పదేళ్ల నిజానికి.. వంద రోజుల అబద్ధాలకు మధ్య ఎన్నికల పోరు : మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి

ఖిల్లాఘణపురం, ఏప్రిల్‌ 28: పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీలకు ఓటు వేస్తే తెలంగాణ అంధకా రంగా మారుతుందని మా జీ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రం లో ఆదివారం నాగర్‌కర్నూ ల్‌ ఎంపీ అభ్యర్థి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌కు మద్ధతు గా ఆదివారం మాజీ మం త్రి నిరంజన్‌రెడ్డి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి వ్యాపారులు మహిళలతో మాట్లాడు తూ.. కేంద్రంలో మోదీ.. రాష్ట్రంలో కేడీ ప్రభుత్వాన్ని నమ్ముకుంటే అంతా మోసమే జరుగుతుందని అన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ నిజమైన పాలనకు వంద రోజుల కాంగ్రెస్‌ అబద్ధపు పాలనకు ఎన్నికల పోరు జరుగుతుందని అన్నారు. కరువు తెచ్చిన కాంగ్రెస్‌ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టాలని పిలుపునిచ్చారు. ప్రాణాలు అడ్డు పెట్టి తెలంగాణ సాధించిన కేసీఆర్‌ రాష్ట్రాన్ని కన్న బిడ్డవలే కాపాడుకున్నారని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ మోసపూరిత హామీలు ఇచ్చి ప్రభు త్వంలోకి వచ్చి రైతులను, మహిళలను, నిరుద్యో గులను, పారిశ్రామిక వర్గాలకు ఇబ్బందులకు గురి చేస్తుంటే సహించలేక 70ఏళ్ల వయసులో ఎర్రటి ఎండలో కేసీఆర్‌ పోరుబాట పట్టారని గుర్తు చేశారు. తెలంగాణరాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే బీఆర్‌ఎస్‌ పాలనే శ్రీరామరక్ష అని, పార్లమెంట్‌ ఎన్నికలలో కారు గుర్తుకు ఓటు వేసి ప్రవీణ్‌ కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు రాళ్ల కృష్ణయ్య, ఎంపీపీ కృష్ణ నాయక్‌, మండల సమన్వయకర్త నంది మల్ల అశోక్‌, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 28 , 2024 | 11:30 PM