Share News

ఊరేగింపుగా సిర్సనగండ్లకు సీతారామచంద్రస్వామి ఉత్సవ విగ్రహాలు

ABN , Publish Date - Apr 28 , 2024 | 11:17 PM

సిర్సనగండ్ల సీతారామచంద్రస్వామి ఉత్సవాలు ఈ నెల 16 నుంచి 22 వరకు అంగరంగ వైభవంగా జరిగాయి.

ఊరేగింపుగా సిర్సనగండ్లకు సీతారామచంద్రస్వామి ఉత్సవ విగ్రహాలు
పల్లకిలో ఉత్సవ విగ్రహాలను సిర్సనగండ్లకు తీసుకెళ్తున్న భక్తులు

చారకొండ, ఏప్రిల్‌ 28: సిర్సనగండ్ల సీతారామచంద్రస్వామి ఉత్సవాలు ఈ నెల 16 నుంచి 22 వరకు అంగరంగ వైభవంగా జరిగాయి. శ్రీరామనవమి సందర్భంగా సీతారామచంద్రస్వామి కల్యాణోత్సవంలో భాగంగా ఆదివారం ఆలయ చైర్మన్‌ ఢేరం రామశర్మ, ఈవో మల్లెల రఘు ఆధ్వర్యంలో స్వామి వారికి 16 పండుగ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు. స్వామి వారికి పంచామృతభిషేకం, అలంకరణ, తులసి సహస్రనామర్చన కార్యక్రమాలు నిర్వహించారు. సీతారాచంద్రస్వామి ఆలయం నుంచి అర్చకులు డప్పు, బ్యాండు మేళాలు, కోలాటాల నడుమ స్వామి వారి ఉత్సవ విగ్రహాలను పల్లకిలో పెట్టి ఊరేగింపుగా సిర్సనగండ్ల గ్రామానికి తీసుకెళ్లి ఆంజనేయ స్వామి ఆలయంలో పెట్టినట్లు ఆలయ చైర్మన్‌ ఢేరం రామశర్మ తెలిపారు. ఆలయ అర్చకులు ఢేరం మురళీదర్‌శర్మ, ఢేరం లక్ష్మణశర్మ, ఢేరం వేణుశర్మ, ఢేరం అనంతరామశర్మ, ఢేరం కోదండరామశర్మ, ఢేరం ప్రవీన్‌శర్మ, ఢేరం గోపిశర్మ, ఢేరం ఆనందశర్మ, భక్తులు, సిర్సనగండ్ల గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 28 , 2024 | 11:17 PM