Share News

మానేరు నుంచి ఇసుక తరలింపును అడ్డుకుంటాం

ABN , Publish Date - Apr 29 , 2024 | 12:25 AM

మానేరు పరివాహక ప్రాంత గ్రామాల నుంచి లారీల ద్వారా ఇసుక తరలింపును అడ్డుకుని తీరతామని ఎమ్మెల్యే విజయరమణారావు స్పష్టం చేశారు. సుల్తానాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలోని శాస్త్రినగర్‌లో ఆదివారం ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ తరపున ఎమ్మెల్యే విజయరమణారావు ఇంటింటికి వెళ్లి చేతి గుర్తుపై ఓటు వేసి గడ్డం వంశీని గెలిపించాలని కోరారు.

మానేరు నుంచి ఇసుక తరలింపును అడ్డుకుంటాం
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే విజయరమణారావు

- ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు

సుల్తానాబాద్‌, ఏప్రిల్‌ 28: మానేరు పరివాహక ప్రాంత గ్రామాల నుంచి లారీల ద్వారా ఇసుక తరలింపును అడ్డుకుని తీరతామని ఎమ్మెల్యే విజయరమణారావు స్పష్టం చేశారు. సుల్తానాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలోని శాస్త్రినగర్‌లో ఆదివారం ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ తరపున ఎమ్మెల్యే విజయరమణారావు ఇంటింటికి వెళ్లి చేతి గుర్తుపై ఓటు వేసి గడ్డం వంశీని గెలిపించాలని కోరారు. ప్రచారం అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతు మన మానేరు.. మన ఇసుక అంటూ మానేరును పరిరక్షించుకోవా ల్సిన అవసరం మనందరిపై ఉందని అన్నారు. లారీల ద్వారా మానేరు నుంచి ఎవరు ఇసుక తరలించినా చట్టపర మైన చర్యలు, కేసులు తప్పవని హెచ్చరించారు. మన వారు బయట వారు అనే తేడా లేకుండా ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని స్వయంగా అధికారులను ఆదేశించామన్నా రు. మానేరు సమీప గ్రామాల ప్రజలు ఇసుకను ఎలాంటి పన్ను చెల్లించకుండా స్థానిక అవసరాలకు ఉచితంగా తీసుకోవచ్చని అన్నారు. క్వారీల నుంచి లారీల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలించే పద్ధతిని నిలిపివేయాలని సీఎంను కోరతానన్నారు. మానేరు నుంచి ఇసుకను ఎవరు తరలించినా ఉపేక్షించేది లేదన్నారు. తాను స్థానికులకు మేలు జరిగేలా చర్యలు తీసుకోవడం మూలంగా గతంలో ఒక ఇసుక ట్రాక్టర్‌ సుల్తానాబాద్‌కు రావాలంటే 2700 చెల్లించే వారని ప్రస్తుతం కేవలం ఎనిమిది వందల నుంచి వేయి రూపాయలకే ట్రాక్టర్‌ ఇసుక లభిస్తుందన్నారు. శాస్త్రినగర్‌ వాసులకు మున్సిపల్‌ పరంగా ఎదురయ్యే ఇబ్బందులను తాను కమిషనర్‌తో మాట్లాడి పరిష్కరిస్తానని అన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల అనంతరం కేంద్రంలో కాంగ్రెస్‌ ఫ్రభుత్వం వచ్చాక మళ్లీ సుల్తానాబాద్‌ పట్టణ ప్రాంతం వారికి కూడా ఉపాధిహామీ పనులు కల్పిస్తామన్నారు. పెద్దపల్లి నియోజకవర్గం నుంచి అనేకసార్లు ఎంపీగా గెలిచి కేంద్రమంత్రిగా పనిచేసి పెద్దపల్లి ప్రాంత అభివృద్ధికి పాటుపడిన వెంకటస్వామి మనవ డు, మాజీ ఎంపీ వివేక్‌ కుమారుడైన గడ్డం వంశీని గెలిపించాలని ఎమ్మెల్యే ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఐదింటిని నెరవేర్చామన్నారు. మిగతావి ఎన్నికల అనంతరం పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో నాయకు లు సాయిరి పద్మ మహేందర్‌, మినుపాల ప్రకాష్‌ రావు, అంతటి అన్నయ్య గౌడ్‌, దామోదర్‌ రావు, పన్నాల రాములు, గాజుల రాజమల్లు, శ్రీగిరి శ్రీనివాస్‌, అబ్బయ్యగౌడ్‌, బిరుదు క్రిష్ణ, పూల రాజు, రాజలింగం, తిరుపతి, బండ గోపాలు తిరుపతి లచ్చయ్య, వెంకటేశం పాల్గొన్నారు.

- కాంగ్రెస్‌లో పలువురి చేరిక..

సుల్తానాబాద్‌ మండలంలోని పలు గ్రామాలకు చెందిన బీఆర్‌ఎస్‌ నాయకులు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కందునూ రిపల్లి, చిన్నకలువల తాజా మాజీ సర్పంచులు పన్నాల తిరుపతి, ఏరుకొండ రమేష్‌, నారాయణరావుపల్లి గ్రామానికి చెందిన రిటైర్ట్‌ ఎక్సైజ్‌ అధికారి నారాయణ గౌడ్‌, చిన్నబొం కూరు గ్రామానికి చెందిన చారితో పాటు పలువురు నాయకు లు కాంగ్రెస్‌ పార్టీలో చేరగా వారికి ఎమ్మెల్యే విజయరమణా రావు కండువాలు కప్పి స్వాగతం పలికారు.

Updated Date - Apr 29 , 2024 | 12:25 AM