Share News

మత విద్వేష రాజకీయాలను తిప్పికొట్టాలి

ABN , Publish Date - May 09 , 2024 | 12:44 AM

పార్లమెంట్‌ ఎన్నికల్లో మత విద్వేష రాజకీయాలను తిప్పికొట్టాలని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలో కోరుట్ల నియోజకవర్గ టీజేయస్‌ ఇన్‌చార్జి కంతి మోహన్‌రెడ్డి నిర్వహించిన నియోజకవర్గ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

మత విద్వేష రాజకీయాలను తిప్పికొట్టాలి
సమావేశంలో మాట్లాడుతున్న ప్రొఫెసర్‌ కోదండరాం

- తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం

మెట్‌పల్లి, మే 8: పార్లమెంట్‌ ఎన్నికల్లో మత విద్వేష రాజకీయాలను తిప్పికొట్టాలని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలో కోరుట్ల నియోజకవర్గ టీజేయస్‌ ఇన్‌చార్జి కంతి మోహన్‌రెడ్డి నిర్వహించిన నియోజకవర్గ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ దేశంలో అవినీతికి పాల్పడుతున్న కార్పొరేట్ల పేర్లు బయటికి రాకుండా మోదీ ప్రభుత్వం ఎలక్షన్‌ బాండ్ల స్కీమ్‌ తీసుకొచ్చి అదానీ అంబానీలకు సంపద పెంచడానికి కృషి చేసిందన్నారు. మత విద్వేష రాజకీయలు చేస్తున్న బీజేపీకి బుద్ధి చెప్పాలన్నారు. పదేళ్లలో మోదీ ప్రభుత్వం తెలంగాణకు చేసిన ప్రత్యేక మేలేమీ లేదన్నారు. రాష్ట్ర విభజన హామీలను అమలు చేయకుండా తెలంగాణను ఇబ్బందులకు నెట్టిందన్నారు. రాష్ట్రంలోని నీటి పారుదల ప్రాజెక్టును జాతీయ హోదా ఇవ్వలేదని, కృష్ణా జలాలలో తెలంగాణా వాటాను నేటికి తేల్చలేదన్నారు. దేశంలో జరిగిన 2014, 2019 ఎన్నికల సమయంలో రైతుల పంటలకు కనీస మద్దతు ధరలు, స్వామినాథన్‌ కమిషన్‌ అమలు గురించి అడుగుతుంటే సాధ్యం కాదనంటున్నారన్నారు. అదానీ వంటి కార్పొరేట్‌ కంపెనీల లాభాల కోసం రైతుల కు నష్టం చేసే మూడు వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిందన్నారు. చట్టాలను తిరస్కరణ కోసం ఉద్యమించిన రైతులను హింసాకాండ చేసి బలి తీసుకొన్న తరువాత రద్దు చేశారన్నారు. కార్మికుల హక్కులు, సంక్షేమం కోసం సాధించుకున్న 46 చట్టాలను పక్కన పెట్టి, నాలుగు లేబర్‌ కోడ్‌లను తీసుకొచ్చి శ్రమదోపిడికి కార్పొరేట్లకు స్వేచ్ఛను ఇచ్చిందన్నారు. ప్రజల మధ్య ఉండి నిరం తరం సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేసే కాంగ్రెస్‌ అభ్యర్థి, ఎమ్మెల్సీ టి జీవన్‌రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు జువ్వాడి నర్సింగరావు, చుక్క గంగారెడ్డి, చింతకుంటా శంకర్‌, అల్లూరి మహేందర్‌రెడ్డి, తొగిటి అంజయ్య, రెబ్బటి మల్లయ్యయాదవ్‌, కంతి రమేష్‌, పసునూరి శ్రీనివాస్‌, వన్నెల శశి, తెడ్డు ఆనంద్‌, సురక్ష, దిలీప్‌, అశోక్‌, సతీష్‌, శ్యామ్‌, రంజాన్‌, రిజ్వాన్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 09 , 2024 | 12:44 AM