Share News

కార్మిక చట్టాలను కాపాడుకోవాలి

ABN , Publish Date - Apr 29 , 2024 | 12:27 AM

కార్మికుల చట్టాలను కాపాడుతూ హక్కుల సాధన కోసం పోరాటం చేయాలని సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌(ఏఐటీయూసీ) అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్‌ పిలుపునిచ్చారు.

కార్మిక చట్టాలను కాపాడుకోవాలి
సమావేశంలో మాట్లాడుతున్న వాసిరెడ్డి సీతారామయ్య

్ల ఏఐటీయూసీ అధ్యక్షుడు సీతారామయ్య

గోదావరిఖని, ఏప్రిల్‌ 28: కార్మికుల చట్టాలను కాపాడుతూ హక్కుల సాధన కోసం పోరాటం చేయాలని సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌(ఏఐటీయూసీ) అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్‌ పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక ఇల్లందు క్లబ్‌లో నిర్వహించిన శిక్షణ తరగతులకు వారు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అనేక దశాబ్దాలు కార్మికులు పోరాటం చేసి సాధించుకున్న హక్కులను నాలుగు లేబర్‌ కోడ్‌లుగా మార్చిందని, పని గంటలు పెంచేందుకు కుట్రలు చేస్తుందని వారు ఆరోపించారు. కార్మికుల హక్కుల సాధన కోసం, సాధించుకున్న హక్కులను పరిరక్షించేందుకు, యాజమాన్యంతో ఎలా వ్యవహరించాలి అనే అంశాలను వివరించారు. కార్మిక చట్టాలను కోడ్‌లుగా విభజించడం వల్ల దీని ప్రభావం తీవ్రమవుతుందని, దీనిని తిప్పికొట్టాలని వారు పిలుపునిచ్చారు. సంస్థలో పాతతరం కార్మికులు పదవీవిరమణ పొందారని, తరువాత నూతనంగా యువ కార్మికులు ఉద్యోగాలు చేస్తున్నారని, వారికి కార్మిక చట్టాలపై అవగాహన లేదని, వారికి అవగాహన కల్పించేందుకు కృషి చేయాలన్నారు. సింగరేణి మనుగడ కోసం కృషిచేయాలని, పదవీవిరమణ పొందిన రిటైర్డ్‌ కార్మికులకు బెనిఫిట్స్‌, మైన్స్‌ రూల్స్‌, స్టాండింగ్‌ ఆర్డర్స్‌పై అవగాహన కల్పించారు. 135ఏళ్ల చరిత్ర కలిగిన సింగరేణిలో అనేక సంస్కరణలు వచ్చాయని, బొగ్గు ఉత్పత్తి 72మిలియన్‌ టన్నులకు పెరిగిందని, సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ శిక్షణ తరగతుల్లో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఎండీ యూసుఫ్‌, సింగరేణి రిటైర్డ్‌ డీజీఎం శ్యాంసుందర్‌రెడ్డి, వైద్యులు సుమన్‌, యాస శ్రీనివాస్‌, సాబీర్‌పాషా, మడ్డి ఎల్లయ్య, ఆరెల్లి పోషం, రంగు శ్రీనివాస్‌, మాదన మహేష్‌, బోగె సతీష్‌బాబు, సంకె అశోక్‌తో పాటు వివిధ విభాగాల్లో పని చేస్తున్న పిట్‌ సెక్రటరీలు పాల్గొన్నారు.

Updated Date - Apr 29 , 2024 | 12:27 AM