Share News

కాంగ్రెస్‌ నాయకుల మాటలు నమ్మొద్దు

ABN , Publish Date - Apr 29 , 2024 | 12:16 AM

కాంగ్రెస్‌ నాయకుల మాటాలు నమ్మకూడదని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీ రామారావు అన్నారు. ఆదివారం రాత్రి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వినోద్‌ కుమార్‌కు మద్దతుగా ఆయన రోడ్‌షో నిర్వహించారు.

కాంగ్రెస్‌ నాయకుల మాటలు నమ్మొద్దు

చొప్పదండి, ఏప్రిల్‌ 28: కాంగ్రెస్‌ నాయకుల మాటాలు నమ్మకూడదని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీ రామారావు అన్నారు. ఆదివారం రాత్రి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వినోద్‌ కుమార్‌కు మద్దతుగా ఆయన రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సమయం లో 420 హామీలిచ్చిందన్నారు. ఒకే ఒక్క బస్సు ఫ్రీ హామీని అమలు చేసిందని, ఎన్నికల తర్వాత ఓట్లు వేయకుంటే అదికూడా తీసివేస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి ఆడపడుచులను బెదిరిస్తున్నాడని చెప్పారు. ఎన్నికల ముందు మహిళలకు తులం బంగారం, ఇంట్లో అత్త, కోడలిద్దరికి 8 వేల రూపాయల పింఛన్‌ ఇస్తామని, అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామని హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. ఇందులో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ, ధాన్యానికి 500 రూపాయల బోనస్‌, రైతుబంధును 15 వేల రూపాయలకు పెంచుతారని ప్రజలు నమ్మి మోసపోయారని చెప్పారు. ఒక్కసారి నమ్మితేనే ఇలా జరిగిందని, మరోసారి మోసపోవద్దని ఆయన అన్నారు. వృద్ధులు, దివ్యాంగులు తమకు 4 వేల పింఛన్‌ వస్తుందనుకుంటే ఉన్న పింఛన్‌కే దిక్కులేదని అన్నారు. ఢిల్లీలో, గల్లీలో బీఆర్‌ఎస్‌ ఉండాలని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ కరీంనగర్‌లో డమ్మీని అభ్యర్థిగా నిలబెట్టిందని, కనీసం కార్యకర్తలను కూడా అభ్యర్థిని గుర్తు పట్టలేరని, బీజేపీ అభ్యర్థిని గెలిపించేందుకే గట్టి పోటీదారులైన జీవన్‌ రెడ్డి, ప్రవీణ్‌ రెడ్డికి టికెట్‌ ఇవ్వలేదన్నారు. గళాన్ని వినిపించే వినోద్‌కుమార్‌ను ఓడించాలనే లక్ష్యంతోనే కాంగ్రెస్‌ పార్టీ డమ్మీ అభ్యర్థిని పోటీలో ఉంచిందన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌ కుమార్‌, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌, జడ్పీటీసీ మాచర్ల సౌజన్య, ఇంచార్జి భూపతిరెడ్డి, వీర్ల వెంకటేశ్వర్‌రావు, సింగిల్‌ విండో చైర్మన్లు మల్లారెడ్డి, తిరుపతిరావు, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఏనుగు రవీందర్‌ రెడ్డి, పార్టీ అధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్‌ రెడ్డి పాల్గొన్నారు.

విద్యార్థినికి అభినందన

రామడుగు, ఏప్రిల్‌ 28: వెలిచాల గ్రామంలోని సరస్వతి ఇంగ్లీష్‌ మీడియం పాఠశాల విద్యార్థి రాచమల్ల నవనీత అబాకస్‌ జాతీయ స్థాయిలో ప్రతిభ చాటడంతో ఆదివారం పలువురు అభినందించారు. పాఠశాల కరస్పాండెంట్‌ ఉప్పుల శ్రీనివాస్‌ మాట్లాడుతూ విద్యార్థినికి ప్రశంసా పత్రం రూ. 2వేల నగదు అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

బాధిత కుటుంబానికి పరామర్శ

గన్నేరువరం, ఏప్రిల్‌ 28, మండలంలోని చొక్కారావుపల్లె గ్రామానికి చెందిన బూర భూదవ్వ ఇటీవల మృతి చెందగా వారి కుటుంబసభ్యులను మండల పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆదివారం పరామర్శించి 25 కిలోల బియ్యం అందజేశారు. కార్యక్రమంలో మండల పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి బూర శ్రీనివాస్‌, కోశాధికారి బొల్లి రవిందర్‌, గాజుల లక్ష్మణ్‌, సదానందం, రవిం దర్‌, నరసయ్య, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 29 , 2024 | 12:16 AM