Share News

లాభాల బాటలో సహకార సంఘాలు

ABN , Publish Date - Apr 26 , 2024 | 11:48 PM

పెద్దపల్లి జిల్లాలోని ఇరవై సహకార సంఘాలు రైతు లకు రుణాలు ఇతర సేవలను అందిస్తూ లాభాల బాటలో పయనిస్తున్నాయని జిల్లా సహకార శాఖ అధికారి శ్రీమాల అన్నారు.

లాభాల బాటలో సహకార సంఘాలు

సుల్తానాబాద్‌, ఏప్రిల్‌ 26: పెద్దపల్లి జిల్లాలోని ఇరవై సహకార సంఘాలు రైతు లకు రుణాలు ఇతర సేవలను అందిస్తూ లాభాల బాటలో పయనిస్తున్నాయని జిల్లా సహకార శాఖ అధికారి శ్రీమాల అన్నారు. సుల్తానాబాద్‌ మండలంలోని చిన్నకలువల సహకార సంఘం ఆధ్వర్యంలో దేవునిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసి న ఐఓసీ పెట్రోల్‌ బంకు రీటైల్‌ ఔట్‌లెట్‌ను డీసీవో శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా డీసీవో మాట్లాడుతూ జిల్లాలోని సహకార సంఘాలు రైతులకు రుణాలు,ఎరువులు, విత్తనాలు వంటివి పంపిణీ చేస్తూ మరోవైపు ధాన్యం కొనుగో లు కేంద్రాలను నిర్వహిస్తూ, రైతులకు వారి కుటుంబ సభ్యుల అవసరాలను తీర్చ డంలో సూపర్‌బజార్‌లు, వాటర్‌ ప్లాంట్‌లను, పెట్రోల్‌బంకులను, గోదాములను నిర్వహిస్తున్నాయని వివరించారు. సొసైటీలు వ్యవసాయ ఆధారితమైన సేవలను కాకుండా వాణిజ్యపరమైన అన్ని సేవలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా సంఘాలు ఆర్థికంగా బలోపేతం అవుతాయన్నారు. సుల్తానాబాద్‌, చిన్నక లువల సొసైటీలు నిర్వహిస్తున్న సేవలను చెపుతు వాటిని ఆదర్శంగా తీసుకోవాల ని సంఘ పాలకవర్గం సీఈఓలు ఎప్పటికపుడు పర్యవేక్షిస్తూ విజయవంతంగా సొసైటీలను నడుపాలన్నారు.

34 పెట్రోల్‌ బంకులు, గ్యాస్‌ ఏజెన్సీలు..

- కేడీసీసీబీ సీఈవో సత్యనారాయణరావు

కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలోని సహకార సంఘాల అధ్వర్యంలో 34 పెట్రోల్‌ బం కులను నిర్వహిస్తున్నామని కేడీసీసీబీ సీఈఓ సత్యనారాయణరావు తెలిపారు. ఈ పెట్రోల్‌ బంకులు, గ్యాస్‌ ఏజన్సీలు సొసైటీలు నిర్వహిస్తున్నాయని నిర్వహణఖు సంఘాలకు నాలుగు శాతం మేరకు రుణాలు అందిస్తామన్నారు. ఉమ్మడి జిల్లాలో ని సంఘాలలో అనేక సేవలను పెంపొందిస్తూ వాటిని బహులార్థ సంఘాలుగా ప్రభుత్వపరంగా తీర్చిదిద్దుతామని సొసైటీలను ఆర్థిక స్వయం ప్రతిపత్తి సాధిం చేలా కృషిచేస్తూ తమ సహకారం అందిస్తామన్నారు. ప్యాక్స్‌ డెవలప్‌మెంట్‌ మేనే జర్‌ సత్యనారాయణ మాట్లాడుతూ సహకార సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే బంకులకు వాటి నిర్వహణ పెట్టుబడి కింద రూ.9.50 కోట్లు మంజూరు చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సహకార శాఖ అసిస్టెంట్‌ రిజిష్ట్రార్‌ వెంకటేశ్వర్లు, సుల్తానాబాద్‌, పెద్దపల్లి బ్యాంకు మేనేజర్లు శశిధర్‌ రావు, హన్మంతరావు, ఐఓసీ ప్రతినిధులు ఆకాశ్‌, నితీష్‌, సీఈవోలు వల్లంకొండ రమేష్‌, బూరుగు సతీష్‌ తదితరలు పాల్గొన్నారు. కాగా డీసీవో తదితరులను సంఘ సీఈవో రమేష్‌ ఘనం గా సన్మానించారు.

Updated Date - Apr 26 , 2024 | 11:48 PM