Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ భారీ వర్షాలు..ఎప్పటి వరకంటే..
ABN , Publish Date - May 18 , 2024 | 04:34 PM
వర్షం స్వల్ప విరామం ఇచ్చిన నేపథ్యంలో ఈరోజు సాయంత్రం తర్వాత హైదరాబాద్(hyderabad)లో మళ్లీ వర్షం(rains) కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లో కూడా మరికొన్ని రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు వానలు కురుస్తాయని వెదర్ రిపోర్ట్ అంచనా వేసింది.
తెలుగు రాష్ట్రాల్లో వర్షం స్వల్ప విరామం ఇచ్చిన నేపథ్యంలో ఈరోజు (శనివారం) సాయంత్రం తర్వాత హైదరాబాద్(hyderabad)లో మళ్లీ వర్షం(rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌కు దగ్గరగా ఉన్న వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, శంకర్‌పల్లె ప్రాంతాల్లో భారీ వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతోపాటు నగరంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ రిపోర్ట్ అంచనా వేసింది.
అంతేకాదు నైరుతి బంగాళాఖాతంలో ఈనెల 22న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్పింది. ఇది మే 24 నాటికి వాయుగుండంగా మారే ఛాన్స్ ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో ఈనెల 23 వరకు ఏపీ(ap), తెలంగాణ(telangana)లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెదర్ రిపోర్ట్ తెలిపింది. ఈ క్రమంలో కోస్తాంధ్ర, తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వానలు కురిచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
ఈ నేపథ్యంలో హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. దీంతోపాటు వానల సమయాల్లో ప్రయాణాలు చేసే ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలన్నారు.