Share News

Danam Nagender: బీజేపీతో బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం.. దానం నాగేందర్ సంచలన ఆరోపణలు

ABN , Publish Date - Apr 20 , 2024 | 09:23 PM

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ‌తో బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం చేసుకోవడానికి ప్లాన్ చేస్తోందని సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagender) సంచలన ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా దానం నాగేందర్ మాట్లాడుతూ... బీఆర్ఎస్‌నే బీజేపీతో లోపాయికారి ఒప్పందం చేసుకుంటుందని ఆరోపించారు.

Danam Nagender: బీజేపీతో బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం.. దానం నాగేందర్ సంచలన ఆరోపణలు

హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ‌తో బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం చేసుకోవడానికి ప్లాన్ చేస్తోందని సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagender) సంచలన ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా దానం నాగేందర్ మాట్లాడుతూ... బీఆర్ఎస్‌నే బీజేపీతో లోపాయికారి ఒప్పందం చేసుకుంటుందని ఆరోపించారు. అందుకే ఆ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరానని స్పష్టం చేశారు.


TG Politics: నన్ను టచ్‌ చేస్తే మాడి మసైపోతావ్.. కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

సెక్యులర్ పార్టీ అని చెప్పుకునే బీఆర్ఎస్ బీజేపీతో ఎలా పొత్తు పెట్టుకుంటుందని ప్రశ్నించారు. ఇప్పటివరకు సెక్యులర్ పార్టీ అని చెప్పుకొని ఏ మొహం పెట్టుకొని బీజేపీతో పొత్తు పెట్టుకుందామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారని చెప్పారు. కేటీఆర్‌ని తాను నిలదీస్తే ఆయన నుంచి తనకు సమాధానం రాలేదన్నారు. కానీ ఏదో ఒక రోజు వీరు లోపాయికారి ఒప్పందం పెట్టుకుంటారని.. వారితో తెగదెంపులు చేసుకొని తన సొంత గూటికి వచ్చానని అన్నారు. బీజేపీకి ఉన్నది కేవలం సోషల్ మీడియా మాత్రమేనని.. వాటి ద్వారానే అసత్య ప్రచారాలు ప్రచారం చేస్తున్నారని దానం నాగేందర్ ధ్వజమెత్తారు.


Nalgonda: లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు కష్టమే.. గుత్తా సంచలన వ్యాఖ్యలు

దీక్ష విరమించిన హనుమంతరావు

బీజేపీకి అనుకూలంగా మాట్లాడినట్లు వస్తున్న వార్తలను పీసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ సీనియర్ నేత వి. వి. హనుమంతరావు ఖండించారు. అసత్య ప్రచారం చేస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలంటూ అంబర్‌పేటలోని తన నివాసంలో మౌన దీక్ష నిర్వహించారు. తన వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా తాను బీజేపీకి అనుకూలంగా మాట్లాడినట్లు కొంతమంది చేస్తున్న దుష్ప్రచారంపై తగిన విచారణ చేయాలని కోరారు. తనను ఇబ్బంది పెట్టిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని హనుమంతరావు డిమాండ్ చేశారు.


Etela Rajender: బీఆర్ఎస్‌కు ఓటు వేస్తే నష్టమే తప్ప, లాభం లేదు..

ఈ దీక్షకు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సంఘీభావం తెలిపారు. మౌన దీక్ష చేపట్టిన వి. హనుమంతరావు చేత దానం నాగేందర్ దీక్ష విరమించారు. సిద్ధాంతానికి కట్టుబడి పదవులు వచ్చిన రాకపోయినా పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేసిన వ్యక్తి హనుమంతరావు అని దానం నాగేందర్ కొనియాడారు. ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేశామన్నారు. వారు వెంటనే తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హనుమంతరావుపై ఒక వర్గం చేస్తున్న అసత్య ప్రచారాలు వట్టి నిరాధారమైనవని దానం నాగేందర్ అన్నారు.


BJP: తెలంగాణకు బీజేపీ అగ్రనేతలు.. త్వరలో ప్రధాని మోదీ, అమిత్ షా పర్యటన

మరిన్ని తెలంగాణ వార్తల కోసం...

Updated Date - Apr 20 , 2024 | 09:27 PM