Share News

Kumaram Bheem Asifabad: రాజ్యాంగ పరిరక్షణకు ఏకం కావాలి: ప్రొఫెసర్‌ కోదండరాం

ABN , Publish Date - May 08 , 2024 | 11:02 PM

ఆసిఫాబాద్‌, మే 8: రాజ్యంగం ప్రమాదంలో ఉందని, దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం వచ్చిందని టీజేఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు.

Kumaram Bheem Asifabad: రాజ్యాంగ పరిరక్షణకు ఏకం కావాలి: ప్రొఫెసర్‌ కోదండరాం

- రాజ్యంగాన్ని కాపాడుకోవాల్సిన అవరసరం ఎంతైనా ఉంది

- ఆసిఫాబాద్‌ రౌండ్‌ సమావేశంలో ప్రొఫెసర్‌ కోదండరాం

ఆసిఫాబాద్‌, మే 8: రాజ్యంగం ప్రమాదంలో ఉందని, దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం వచ్చిందని టీజేఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని రోజ్‌గార్డెన్‌లో టీజేఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘‘ప్రమాదంలో ప్రజాస్వామ్యం’’ అనే అంశంపై రౌండ్‌టేబుల్‌ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో సమస్యలు చాలా ఉన్నాయని మాకు సీట్లు ఇవ్వండి రాజ్యంగాన్ని మార్చేస్తామని చర్చ జరుగు తోందన్నారు. రాజ్యంగం ద్వారా అన్ని వర్గాలను మనుషులుగా బతికేలా ఒక వేదికగా నిలిచిందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌లో అసమానతలు పెరిగాయన్నారు. అదాని, అంబానీల ఆస్తులు కోట్లలో పెరిగాయని కానీ దేశానికి అన్నం పెట్టే రైతు పరిస్థితి మాత్రం అలాగే ఉందన్నారు. వ్యవసాయం కుంటుపడి పోతోందని అవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయంతో బతికే పరిస్థితి లేదని పట్టణాలలో సెక్యూరిటీ గార్డు పని చేసింది నయమని రైతులు వాపొతున్నారన్నారు. కార్పొరేట్‌ వ్యవస్థను బతికించేలా ప్రభుత్వాలు పని చేస్తున్నాయ న్నారు.

ఈ పరిస్థితి పోవాలంటే రాజ్యాంగ పరిరక్షణ ఒకటే సాధ్యమన్నారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం ఈ ఎన్నికల్లో ఏం చేయాలనే నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లా డుతూ రాజ్యంగ పరిరక్షణకు ఇండియా కూట మికి ఓటు వేయాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో సీనియర్‌ జర్నలిస్టు మునీర్‌, రవిందర్‌, డీసీసీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్ర సాద్‌రావు, టీజేఎస్‌ ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా అధ్యక్షుడు బాబన్న, ఆయాసంఘాల నాయ కులు డాక్టర్‌ రమేష్‌, అబ్దుల్లా, ఓదెలు, శ్యాం, కార్తీక్‌, దినకర్‌, చిరంజీవి, చిన్నన్న, ఆసీఫ్‌, అసద్‌, వసంత్‌ రావు, మారుతి, చాంద్‌పాషా, మాలశ్రీ, కళావతి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 08 , 2024 | 11:02 PM