Share News

Kumaram Bheem Asifabad: 2న ఆసిఫాబాద్‌కు రానున్న సీఎం

ABN , Publish Date - Apr 28 , 2024 | 10:10 PM

ఆసిఫాబాద్‌రూరల్‌, ఏప్రిల్‌ 28: పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా మే2న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆసిఫాబాద్‌ జిల్లాకేంద్రానికి రాను న్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం మంత్రి సీతక్క జిల్లా నాయకులతో కలిసి సీఎం పర్య టనకు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్షించారు.

Kumaram Bheem Asifabad:   2న ఆసిఫాబాద్‌కు రానున్న సీఎం

ఆసిఫాబాద్‌రూరల్‌, ఏప్రిల్‌ 28: పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా మే2న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆసిఫాబాద్‌ జిల్లాకేంద్రానికి రాను న్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం మంత్రి సీతక్క జిల్లా నాయకులతో కలిసి సీఎం పర్య టనకు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్షించారు. పట్టణంలోని ప్రేమల గార్డెన్‌ సమీపంలో సభాస్థలిని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం పర్యటనను విజయవంతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు కృషిచేయాలన్నారు. జిల్లాలోని ఆసిఫాబాద్‌, సిర్పూర్‌ నియోజక వర్గాల నుంచి పెద్దసంఖ్యలో జనాలను సమీకరించేందుకు ప్రత్యేకదృష్టి సారిం చాలన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి తోపాటు రాష్ట్ర కాంగ్రెస్‌పార్టీ అధినాయకులు హాజరవుతారని పేర్కొన్నారు. సీఎం సభకు తర లివచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను చేపట్టాలని నాయకులకు సూచించారు.

Updated Date - Apr 28 , 2024 | 10:10 PM