Share News

Kumaram Bheem Asifabad: రిజర్వేషన్ల తొలగింపునకు కుట్ర : మంత్రి సీతక్క

ABN , Publish Date - Apr 28 , 2024 | 10:12 PM

ఆసిఫాబాద్‌రూరల్‌, ఏప్రిల్‌ 28: బీజేపీ పాలనలో అట్టడుగువర్గాలకు ఆత్మ గౌరవం మిగిలే పరిస్థితి లేదని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రిజర్వేషన్లు తొల గించి వాళ్లకి తీరని ఆన్యాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని మంత్రి సీతక్క అన్నారు.

Kumaram Bheem Asifabad:  రిజర్వేషన్ల తొలగింపునకు కుట్ర : మంత్రి సీతక్క

ఆసిఫాబాద్‌రూరల్‌, ఏప్రిల్‌ 28: బీజేపీ పాలనలో అట్టడుగువర్గాలకు ఆత్మ గౌరవం మిగిలే పరిస్థితి లేదని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రిజర్వేషన్లు తొల గించి వాళ్లకి తీరని ఆన్యాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని మంత్రి సీతక్క అన్నారు. ఆదివారం మండలంలోని అప్పపెల్లి, మోతుగూడ, అంకుశాపూర్‌ గ్రామాల్లో పర్యటించి ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణక్కతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజ్యంగాన్ని తొలగించి పేదల హక్కు లను కాలరాసే విధంగా మోదీ ప్రభుత్వం ఆలోచి స్తోందన్నారు. కేసీఆర్‌ పాలనలో రాష్ట్రం రూ.7లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందన్నారు. ఆ అప్పులకు ఇప్పటివరకు రూ.29వేల కోట్ల వడ్డీని రాష్ట్రప్రభుత్వం చెల్లించిందన్నారు. రాహుల్‌ గాంధీ ప్రధానమంత్రి అయితేనే రిజర్వేషన్లు, హక్కులు ఉంటాయని దేశం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి సుగుణక్కను భారీ మెజా ర్టీతో గెలిపించాలన్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు మంత్రికి పలు సమస్యలపై వినతి పత్రాలు సమర్పించారు. అనంతరం బీఆర్‌ఎస్‌ నాయకురాలు మర్సుకోల సరస్వతి సోదరుడు సుధాకర్‌ ఇటీవల ఆనారోగ్యంతో మృతిచెందడంతో మంత్రి సీతక్క సరస్వతి నివాసానికి వెళ్లి పరామ ర్శించారు. ఈ సందర్భంగా రెబ్బెన మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్‌ పార్టీలో చేరగా వారికి పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్య క్రమంలో డీసీసీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్‌ రావు, ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి, మాజీఎమ్మెల్సీ పురాణం సతీష్‌, నియోజకవర్గనాయకుడు శ్యాంనాయక్‌, మాజీ ఎంపీపీ బాలేశ్వర్‌గౌడ్‌, మాజీమార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గాదవేణి మల్లేష్‌, ఓయూ జేఏసీ నాయకుడు అనిల్‌, పార్టీమండల అధ్యక్షుడు చరణ్‌, మహిళ నాయకు రాళ్లు మంగ, కళావతి తదితరులు పాల్గొన్నారు.

నిధులన్నీ గుజరాత్‌, యూపీలకేనా?

కెరమెరి: కేంద్రప్రభుత్వం నిధులన్నింటినీ గుజ రాత్‌, యూపీ రాష్ట్రాలకే కేటాయిస్తోందని మంత్రి సీతక్క ఆరోపించారు. పార్లమెంట్‌ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా కెరమెరి మండల కేంద్రం లోని స్టార్‌ ఫంక్షన్‌హాలులో ఏర్పాటు చేసిన సభకు ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్‌తో కలిసి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రధానమంత్రిగా దేశంలోని అన్ని రాష్ట్రాలకు సమానంగా నిధులు కేటాయంచాల్సి ఉండగా కేవలం గుజరాత్‌, ఉత్తర ప్రదేశ్‌లకే నిధులన్నీ దోచి పెడుతున్నారని ఆరోపిం చారు. గత ఎన్నికల సమయంలో జన్‌ ధన్‌ ఖాతాలో రూ.15లక్షలు జమ చేస్తామని చెప్పిప్రజలను మోసం చేశారన్నారు.

జిల్లాలో మాలీ కులస్తులు ఆధిక సంఖ్యలో ఉన్నారని ఎన్నికల కోడ్‌ అనంతరం వారి సమస్య లను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామన్నారు. అలాగే మాలీ కులస్తులకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్‌ మాట్లాడుతూ పేదల సంక్షేమమే కాంగ్రెస్‌పార్టీ ధ్యేయమని రాబోయే ఎన్నికలలో బీఆర్‌ఎస్‌, బీజేపీలకు ఓటుతో తగినబుద్ది చెప్పాలన్నారు. కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణక్కను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్కకు పలు సమస్యలపై ఆయాగ్రామాల ప్రజలు వినతిపత్రాలను అందజే శారు. గ్రామపంచాయతీ సిబ్బంది సమస్యలను పరి ష్కరించాలని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. కార్య క్రమంలో మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేం సాగర్‌రావు, డీసీసీ ఆధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసా ద్‌రావు, ఎంపీ అభ్యర్థి అత్రం సుగుణ, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్‌, నియోజకవర్గ ఇన్‌చార్జీ శ్యాంనాయక్‌, నాయకులు మునీర్‌ అహ్మద్‌, బాలేష్‌గౌడ్‌, గాదవేణి మల్లేష్‌, అత్రం లక్ష్మణ్‌, శ్రీనివాస్‌, కుసుంరావు తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌లో చేరిన మైనార్టీ నాయకులు..

మంత్రి సీతక్క సమక్షంలో బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి జిల్లా మైనార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. జిల్లా మైనార్టీనాయకులు అబ్దుల్లా, అమనుల్లా పర్వేజ్‌, తన్వీర్‌తో పాటు సుమారు 40మందికి పైగా మైనార్టీ నాయకులు బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కాంగ్రెస్‌ పార్టీలో చేరిన మైనార్టీ నాయకులకు మంత్రి సీతక్క కండు వాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సంద ర్భంగా కెరమెరి మండల కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయాన్ని మంత్రి సీతక్క ప్రారంభించారు.

Updated Date - Apr 28 , 2024 | 10:12 PM