Share News

Kumaram Bheem Asifabad: భానుడి భగభగలు

ABN , Publish Date - Apr 28 , 2024 | 10:08 PM

ఆసిఫాబాద్‌, ఏప్రిల్‌ 28: ఎండలు దంచి కొడుతున్నాయి. భానుడి భగభగలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఒకదిక్కు ఎండవేడిమి, మరోదిక్కు వేడి వడగాలులతో జనం సతమతమవుతున్నారు. ఉదయం 9 గంటల నుంచే భానుడు తనఉగ్ర రూపాన్ని చూపుతున్నాడు.

Kumaram Bheem Asifabad:  భానుడి భగభగలు

- జిల్లాలో 44.6డిగ్రీల ఉష్ణోగ్రతలు

ఆసిఫాబాద్‌, ఏప్రిల్‌ 28: ఎండలు దంచి కొడుతున్నాయి. భానుడి భగభగలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఒకదిక్కు ఎండవేడిమి, మరోదిక్కు వేడి వడగాలులతో జనం సతమతమవుతున్నారు. ఉదయం 9 గంటల నుంచే భానుడు తనఉగ్ర రూపాన్ని చూపుతున్నాడు. మధ్యాహ్నంవేళలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. జనం బయటకు రావాలంటే జంకుతున్నారు. ఇండ్ల లోనే ఉంటూ కూలర్లు, ఏసీలతో ఎండ వేడిమి నుంచి ఉపశ మనం పొందుతు న్నారు. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రత లతో శీతలపానీయాల విక్రయాలు జోరందు కున్నాయి. తాటిముంజలను పెద్దసంఖ్యలో విక్రయిస్తున్నారు. ఏప్రిల్‌ చివరిలోనే ఎండలు దడ పుట్టిస్తుంటే ఇక మే నెలలో ఏ విధంగా ఉంటాయేనని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

జిల్లాలో 44.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు..

జిల్లాలో ఆదివారం 44.6డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తిర్యాణి లో44.6, ఆసిఫాబాద్‌లో 44.5, కాగజ్‌నగర్‌లో 44.4, పెంచికల్‌పేటలో 43.8, రెబ్బెన లో 43.7, దహెగాంలో 43.3, బెజ్జూర్‌లో 43.1, కౌటాలలో 42.8 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Updated Date - Apr 28 , 2024 | 10:08 PM