KL Rahul: చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్.. ధోనీ ఆల్‌టైం రికార్డ్ బద్దలు
ABN , Publish Date - Apr 21 , 2024 | 08:46 AM
ఐపీఎల్-2024 ప్రారంభంలో కాస్త తడబడిన లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్.. ఆ తర్వాత క్రమంగా పుంజుకొని తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. ముఖ్యంగా.. ఏప్రిల్ 19వ తేదీన చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి సత్తా చాటాడు.
ఐపీఎల్-2024 (IPL 2024) ప్రారంభంలో కాస్త తడబడిన లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul).. ఆ తర్వాత క్రమంగా పుంజుకొని తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. ముఖ్యంగా.. ఏప్రిల్ 19వ తేదీన చెన్నై సూపర్ కింగ్స్‌తో (Chennai Super Kings) జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి సత్తా చాటాడు. కేవలం 53 బంతుల్లోనే 9 ఫోర్లు, 3 సిక్సుల సహకారంతో 82 పరుగులు చేసి.. జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. అంతేకాదు.. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్‌ని సైతం సొంతం చేసుకున్నాడు.
శివమ్ దూబే చీటింగ్ చేశాడా.. అంపైర్ ఎందుకలా చెక్ చేశాడు?
ఈ క్రమంలోనే కేఎల్ రాహుల్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు 50+ స్కోర్ చేసిన వికెట్ కీపర్ బ్యాటర్‌గా చరిత్రపుటలకెక్కాడు. తద్వారా.. ఇప్పటివరకూ సీఎస్కే మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) పేరిట ఉన్న ఈ రికార్డ్ బద్దలైపోయింది. ఐపీఎల్‌లో ఎంఎస్ ధోనీ ఇప్పటివరకూ 24 సార్లు 50+ స్కోర్ చేయగా.. కేఎల్ రాహుల్ 25 సార్లు నమోదు చేసి అగ్రస్థానానికి కైవసం చేసుకున్నాడు. ఇక ధోనీ తర్వాత క్వింటన్ డీకాక్ (23), దినేశ్ కార్తిక్ (Dinesh Karthik) (21), రాబిన్ ఉతప్ప (18) వరుసగా మూడు, నాలుగు, ఐదో స్థానాల్లో నిలిచారు.
Hardik Pandya: హార్దిక్ పాండ్యాకు ఆ సమస్య.. విరుచుకుపడ్డ స్టార్
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన సీఎస్కే జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. జడేజా (57) అర్థశతకంతో రాణించడం, చివర్లో ధోనీ (28) మెరుపులు మెరిపించడంతో.. సీఎస్కే అంత స్కోరు చేయగలిగింది. అనంతరం లక్ష్య ఛేధనలో భాగంగా.. ఎల్ఎస్‌జీ జట్టు 19 ఓవర్లలోనే రెండు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసి విజయఢంకా మోగించింది. కేఎల్ రాహుల్ (82), డీకాక్ (54) అర్థశతకాలతో అదరగొట్టడంతో.. లక్నో జట్టు సునాయాసంగా ఈ విజయాన్ని సొంతం చేసుకోగలిగింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి