Share News

Viral Video: బాబోయ్.. వీళ్లేం టీచర్లు.. స్టూడెంట్స్ ఎదుటే పొట్టుపొట్టుగా ఎలా కొట్టుకున్నారో చూడండి..!

ABN , Publish Date - May 04 , 2024 | 02:33 PM

వారిద్దరూ ఉపాధ్యాయులు.. పిల్లలు గొడవ పడితే మందలించాల్సిన వాళ్లు.. అలాంటిది వారే పిల్లల ఎదుట గొడవకు దిగారు.. వయసు, సభ్యత మరిచి పిల్లల్లా కొట్టుకున్నారు.. వారి ఫైటింగ్‌ను అక్కడే ఉన్న వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది.

Viral Video: బాబోయ్.. వీళ్లేం టీచర్లు.. స్టూడెంట్స్ ఎదుటే పొట్టుపొట్టుగా ఎలా కొట్టుకున్నారో చూడండి..!
Teachers fighting

వారిద్దరూ ఉపాధ్యాయులు (Teachers).. పిల్లలు గొడవ పడితే మందలించాల్సిన వాళ్లు.. అలాంటిది వారే పిల్లల ఎదుట గొడవకు దిగారు.. వయసు, సభ్యత మరిచి పిల్లల్లా కొట్టుకున్నారు.. వారి ఫైటింగ్‌ను అక్కడే ఉన్న వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు (Teachers Fighting). ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. అసలు ఆ గొడవ ఎందుకు మొదలైందో తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే. స్కూల్‌కు ఆలస్యంగా వచ్చిన టీచర్‌ను ప్రిన్సిపాల్ నిలదీయడంతో ఆ గొడవ మొదలైంది (Viral Video).


ఆగ్రా (Agra)లోని ఓ ప్రాథమిక పాఠశాలలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ స్కూల్‌లో పని చేస్తున్న గుంజా చౌదరి అనే ఉపాధ్యాయురాలు శుక్రవారం నాడు ఆలస్యంగా వచ్చింది. ఆమెను ప్రిన్సిపాల్ మందలించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. గత నాలుగు రోజులుగా మీరు కూడా ఆలస్యంగా వస్తున్నారని ప్రిన్సిపాల్‌ను గుంజా చౌదరి నిలదీసింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి భౌతిక ఘర్షణకు దారి తీసింది. జుట్లు పట్టుకుని కొట్టుకున్నారు.


అక్కడే ఉన్న ఇతర సిబ్బంది వారిని విడదీసేందుకు ప్రయత్నించినా వారు శాంతించలేదు. టీచర్.. ప్రిన్సిపాల్ దుస్తులను చింపివేయగా, ప్రిన్సిపాల్.. టీచర్ జుట్టును లాగేసింది. ఈ ఘటనలో ఇద్దరికీ స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై ఇరువరు పోలీసులుకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్నపోలీసులు విచారణ ప్రారంభించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి..

Viral Video: ఇదేం స్పీడ్ అన్నా.. మూడు సెకెన్లలోనే జెడ్ టూ ఏ.. హైదారాబాదీ సత్తాకు గిన్నీస్ రికార్డు దాసోహం!


Anand Mahindra: వామ్మో.. సర్వీస్ అంటే ఇలా ఉంటుందా? షాకింగ్ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 04 , 2024 | 02:33 PM