Share News

Emotional Video: ఆఫీస్‌లో కూర్చున్న తండ్రి.. హఠాత్తుగా వచ్చిన కొడుకు చెప్పిన న్యూస్ విని ఏం చేశాడో చూడండి..

ABN , Publish Date - Apr 20 , 2024 | 12:51 PM

కొడుకు పుట్టినపుడు కాదు.. వాడు ప్రయోజకుడు అయినపుడు తండ్రి ఎంతగానో సంతోషపడతాడు అని అంటుంటారు. తాజాగా ఓ తండ్రికి అలాంటి అనుభవమే ఎదురైంది. రెండేళ్లు ఎంతో కష్టపడిన కొడుకు ఆఫీస్‌కు వెళ్లి మరీ తన తండ్రిని సర్‌ప్రైజ్ చేశాడు.

Emotional Video: ఆఫీస్‌లో కూర్చున్న తండ్రి.. హఠాత్తుగా వచ్చిన కొడుకు చెప్పిన న్యూస్ విని ఏం చేశాడో చూడండి..
VIRAL VIDEO

కొడుకు (Son) పుట్టినపుడు కాదు.. వాడు ప్రయోజకుడు అయినపుడు తండ్రి (Father) ఎంతగానో సంతోషపడతాడు అని అంటుంటారు. తాజాగా ఓ తండ్రికి అలాంటి అనుభవమే ఎదురైంది. రెండేళ్లు ఎంతో కష్టపడిన కొడుకు ఆఫీస్‌కు వెళ్లి మరీ తన తండ్రిని సర్‌ప్రైజ్ చేశాడు. శుభవార్త విన్న తండ్రి సంతోషంతో తన కొడుకును కౌగిలించుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చాలా మందిని ఎమోషనల్‌కు గురి చేస్తోంది (Viral Video).


ఐఐటీ-రూర్కీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన క్షితిజ్ గుర్భేలే అనే యువకుడు యూపీఎస్సీ (UPSC) సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (CSE) 2023లో ఉత్తీర్ణత సాధించాడు. ఆల్ ఇండియా 441వ ర్యాంకు సాధించాడు. ఆ విషయాన్ని తన తండ్రితో నేరుగా పంచుకోవాలనుకున్నాడు. వెంటనే తండ్రి ఆఫీస్‌కు వెళ్లాడు. ఆ సమయంలో క్షితిజ్ తండ్రి సహోద్యోగులతో కలిసి లంచ్ చేస్తున్నాడు. హఠాత్తుగా వచ్చిన క్షితిజ్‌ను చూసి ఆశ్చర్యపోయి.. ``ఏమిటి`` అని అడిగాడు.


తండ్రి దగ్గరకు వెళ్లిన క్షితిజ్.. ``నీ కంటే పెద్ద అధికారి వచ్చినపుడు లేచి నిలబడడం తెలియదా`` అని అడిగాడు. విషయం అర్థం చేసుకున్న తండ్రి వెంటనే కుర్చీ నుంచి లేచి కొడుకును గట్టిగా కౌగిలించుకున్నాడు. భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. కొడుకుపై ముద్దుల వర్షం కురిపించాడు. ఈ ఘటన మొత్తాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. రెండేళ్ల కష్టానికి తగిన ప్రతిఫలం అంటూ క్షితిజ్ కామెంట్ చేశాడు. ఈ ఎమోషనల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి..

Puzzle: మీ కళ్లకు అసలైన పరీక్ష.. ఈ ఫొటోలో తలుపు లేని ఇల్లు ఎక్కడ ఉందో 7 సెకెన్లలో కనిపెట్టండి..!

Viral Video: వామ్మో.. ఈ టీ తాగాలంటే ధైర్యం ఉండాల్సిందే.. టీ ఎలా తయారు చేస్తున్నాడో చూడండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 20 , 2024 | 12:51 PM