Share News

Viral: మగ సింహం కళ్లల్లోకి గుచ్చిగుచ్చి చూశాడు.. ఆడ సింహం వచ్చి కాపాడకపోయి ఉంటే..

ABN , Publish Date - Apr 29 , 2024 | 09:01 PM

తన కళ్లల్లో కళ్లుపెట్టి చూసినందుకు ఓ మగ సింహం జంతు సంరక్షకుడిపై దాడి చేసేందుకు యత్నించింది. మరో సిబ్బంది, ఆడ సింహం దాని దృష్టి మరల్చడంతో పెను ప్రమాదం తప్పింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Viral: మగ సింహం కళ్లల్లోకి గుచ్చిగుచ్చి చూశాడు.. ఆడ సింహం వచ్చి కాపాడకపోయి ఉంటే..
Male Lion Attacks Zookeeper for Making Eye Contact

ఇంటర్నెట్ డెస్క్: అడవి జంతువులు ముఖ్యంగా క్రూర జంతువులు ఎప్పుడు ఎలా వ్యవహరిస్తాయో తెలియదు. తమకు అలవాటైన సంరక్షకులపై క్షణాల్లో దాడి చేయగలవు. భయం, కోపం, పోటీ లాంటి భావాలతో ఉండే ఈ జంతువులు ఏ క్షణంలోనైనా రాక్షసంగా మారి ప్రాణాలు తీయగలవు. క్రూర జంతువులతో అప్రమత్తంగా ఉండకపోతే ఏం జరుగుతుందో చెప్పే షాకింగ్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ (Viral) అవుతోంది.

ఓ జూలో ఈ ఘటన జరిగింది. వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఎన్‌క్లోజర్‌లో ఉన్న ఓ ఆడ, మగ సింహాలకు జూ సిబ్బంది కాపలా కాస్తున్నారు. ఈ క్రమంలో ఒక జంతు సంరక్షకుడు మగ సింహం కళ్లల్లో కళ్లు పెట్టి చూశాడు. దీంతో, అది వెంటనే అప్రమత్తమైంది. క్షణకాలంలో అతడిపై దాడి ప్రారంభించింది. అతడి కాలు నోటపట్టి కరిచే ప్రయత్నం చేసింది. ఈలోపు అక్కడే ఉన్న మరో జంతుసంరక్షకుడు దాన్ని శాంత పరిచే ప్రయత్నం చేశాడు (Lion attacks zookeeper for making eye contact).


అదే సమయంలో అక్కడే ఉన్న ఆడ సింహం కూడా రంగంలోకి దిగింది. మగ సింహం దృష్టి మరల్చేందుకు, దాని వెంటనే తిరుగుతూ దాన్ని కట్టడి చేసింది. అదే సమయంలో మరో సంరక్షకుడు కూడా దాన్ని అవతలికి తోలే ప్రయత్నం చేయడంతో బాధితుడు ప్రాణాలతో బయటపడ్డాడు.

వీడియోలో ఇదంతా చూసిన నెటిజన్లు షాకైపోతున్నారు. సింహం కళ్లల్లో కళ్లు పెట్టి చూస్తే దాన్ని రెచ్చగొట్టినట్టు, సవాలు విసిరినట్టు అవుతుందని కొందరు కామెంట్ చేశారు. ఇలా రకరకాల కామెంట్ల మధ్య వీడియో వైరల్‌గా మారింది. కోట్ల కొద్దీ వ్యూస్ వచ్చిపడుతున్నాయి.

Read Viral and Telugu News

Updated Date - Apr 29 , 2024 | 09:48 PM