TDP: రాప్తాడులో చంద్రబాబు ప్రజాగళం సభ దృశ్యాలు..

ABN, Publish Date - Mar 29 , 2024 | 09:49 AM

అనంతపురం జిల్లా: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళం యాత్రలో భాగంగా గురువారం ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడులో ఏర్పాటు చేసిన ప్రజాగళం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. జగనాసుర వధకు గడువు 46 రోజులేనని.. ప్రజాగళం సభలకు వస్తున్న ప్రజా ఉధృతే ఈ విషయం చెబుతోందని చెప్పారు. మే 13న ఓట్ల సునామీ రాబోతోందని.. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. సొంత బాబాయి వివేకానందరెడ్డి హత్యపై సీఎం జగన్‌రెడ్డి నంగనాచి కబుర్లు చెబుతుండడం చూస్తుంటే నవ్వొస్తోందని చంద్రబాబు అన్నారు. పులివెందులలో ఆయన మాట్లాడిన తీరు హాలీవుడ్‌.. బాలీవుడ్‌ స్థాయి నటనను మించిపోయిందని ఎద్దేవాచేశారు. మనం ‘మహాశక్తి’తో ఆడబిడ్డలను గౌరవిస్తుంటే.. జగన్‌ సొంత చెల్లెళ్ల పుట్టుకనే ప్రశ్నిస్తున్నారని విమర్శించారు.

TDP: రాప్తాడులో చంద్రబాబు ప్రజాగళం సభ దృశ్యాలు.. 1/7

ఉమ్మడి అనంతపురం జిల్లా, రాప్తాడులో ఏర్పాటు చేసిన ప్రజాగళం బహిరంగ సభలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.

TDP: రాప్తాడులో చంద్రబాబు ప్రజాగళం సభ దృశ్యాలు.. 2/7

రాప్తాడులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళం బహిరంగ సభకు తరలివచ్చిన ప్రజానీకం..

TDP: రాప్తాడులో చంద్రబాబు ప్రజాగళం సభ దృశ్యాలు.. 3/7

రాప్తాడులో జరిగిన ప్రజాగళం సభకు విచ్చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు పుష్పగుచ్చములిచ్చి స్వాగతం పలుకుతున్న మాజీ మంత్రి కాలవ శ్రీనివాస్.. తదితర నేతలు..

TDP: రాప్తాడులో చంద్రబాబు ప్రజాగళం సభ దృశ్యాలు.. 4/7

అనంతపురం జిల్లా, రాప్తాడులో ప్రజాగళం సభకు విచ్చేసిన నారా చంద్రబాబు నాయుడుకు పుష్పగుచ్చములిచ్చి స్వాగతం పలుకుతున్న మాజీ మంత్రి పరిటాల సునీత, తదితర నేతలు..

TDP: రాప్తాడులో చంద్రబాబు ప్రజాగళం సభ దృశ్యాలు.. 5/7

అనంతపురం జిల్లా, సింగనమల నియోజకవర్గం, బుక్కరాయసముద్రంలో జరిగిన ప్రజాగళం బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తున్న నారా చంద్రబాబు నాయుడు.

TDP: రాప్తాడులో చంద్రబాబు ప్రజాగళం సభ దృశ్యాలు.. 6/7

సింగనమల నియోజకవర్గం, బుక్కరాయసముద్రంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళం బహిరంగ సభకు తరలివచ్చిన జనం.

TDP: రాప్తాడులో చంద్రబాబు ప్రజాగళం సభ దృశ్యాలు.. 7/7

అనంతపురం జిల్లా, రాప్తాడులో ప్రజాగళం సభకు విచ్చేసిన టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులకు అభివాదం తెలుపుతున్న నారా చంద్రబాబు నాయుడు, ఇతర నేతలు..

Updated at - Mar 29 , 2024 | 09:49 AM