TDP: కోడుమూరు ప్రజాగళం సభలో చంద్రబాబు..

ABN, Publish Date - Apr 29 , 2024 | 09:32 AM

‘బటన్‌ నొక్కాను.. బటన్‌ నొక్కాను అంటూ బటన్‌రెడ్డి పదేపదే చెబుతున్నాడు. క్లాస్‌ వార్‌ అంటున్నాడు.. ఏది క్లాస్‌ వార్‌..? ఈ ఐదేళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చింది పది రూపాయలు. రూ.వంద బాదేశాడు.. రూ.వెయ్యి నొక్కేశాడు.. తాడేపల్లి ప్యాలెస్‌ను బద్దలుకొడితే పేదల కడుపు నిండుతుంది.. క్లాస్‌ వార్‌ అంటే అదీ..’ అని టీడీపీ అధినేత చంద్రబాబు విరుచుకుపడ్డారు. వైసీపీ నవరత్నాలు నవమోసాలని.. జగన్‌ ప్రకటించిన మేనిఫెస్టో అంతా అబద్ధాల పుట్టని ధ్వజమెత్తారు. 99.5 శాతం అమలు చేశామంటూ ప్రజలను మోసగిస్తున్నాడని.. మళ్లీ మోసపోతే రాష్ట్రాన్ని అమ్మేస్తాడని హెచ్చరించారు. అన్ని వర్గాల ప్రజలనూ దగా చేసిన వైసీపీని మే 13న ఓటుతో భూస్థాపితం చేయాలని ప్రజలకు పిలుపిచ్చారు. ప్రజాగళంలో భాగం గా ఆదివారం కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలోని కౌతాళం, కోడుమూరు నియోజకవర్గంలో జరిగిన భారీ బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు.

TDP: కోడుమూరు ప్రజాగళం సభలో చంద్రబాబు.. 1/6

ప్రజాగళంలో భాగంగా ఆదివారం కర్నూలు జిల్లా, మంత్రాలయం నియోజకవర్గంలోని కౌతాళం, కోడుమూరుకు విచ్చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు.. ప్రజలకు విజయ సంకేతం చూపుతున్న దృశ్యం..

TDP: కోడుమూరు ప్రజాగళం సభలో చంద్రబాబు.. 2/6

కర్నూలు జిల్లా, మంత్రాలయం నియోజకవర్గంలోని కౌతాళం, కోడుమూరులో నిర్వహించిన ప్రజాగళం సభలో ప్రసంగిస్తున్న చంద్రబాబు నాయుడు.

TDP: కోడుమూరు ప్రజాగళం సభలో చంద్రబాబు.. 3/6

ప్రజాగళంలో భాగంగా ఆదివారం కర్నూలు జిల్లా, మంత్రాలయం నియోజకవర్గంలోని కౌతాళం, కోడుమూరుకు విచ్చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు.. ప్రజలకు అభివాదం తెలుపుతున్న దృశ్యం.

TDP: కోడుమూరు ప్రజాగళం సభలో చంద్రబాబు.. 4/6

కర్నూలు జిల్లా, మంత్రాలయం నియోజకవర్గంలోని కౌతాళం, కోడుమూరుకు విచ్చేసిన టీడీపీ అధినేత చంద్రబాబుకు అభిమానులు గొంగళి, మేకపిల్లను బహుకరించిన దృశ్యం.

TDP: కోడుమూరు ప్రజాగళం సభలో చంద్రబాబు.. 5/6

ప్రజాగళంలో భాగంగా ఆదివారం కర్నూలు జిల్లా, మంత్రాలయం నియోజకవర్గంలోని కౌతాళం, కోడుమూరుకు విచ్చేసిన టీడీపీ అధినేత చంద్రబాబుకు స్థానిక టీడీపీ నేత పుష్పగుచ్చములిస్తు్న్న దృశ్యం.

TDP: కోడుమూరు ప్రజాగళం సభలో చంద్రబాబు.. 6/6

ప్రజాగళంలో భాగంగా ఆదివారం కర్నూలు జిల్లా, మంత్రాలయం నియోజకవర్గంలోని కౌతాళం, కోడుమూరులో టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహించిన బహిరంగసభకు భారీగా తరలి వచ్చిన ప్రజలు.

Updated at - Apr 29 , 2024 | 09:32 AM