Share News

NRI: వైభవంగా వరల్డ్ తెలుగు కన్సార్టియం సమావేశం

ABN , Publish Date - May 02 , 2024 | 02:43 PM

మొదటి ప్రపంచ తెలుగు సమితి, "వరల్డ్ తెలుగు కన్సార్టియం" అంతర్జాల సమావేశం అద్భుతంగా జరిగింది.

NRI: వైభవంగా వరల్డ్ తెలుగు కన్సార్టియం సమావేశం
World Telugu consortium

ఎన్నారై డెస్క్: ప్రపంచ తెలుగు సమితి (వరల్డ్ తెలుగు కన్సార్టియం) (NRI) మొదటి అంతర్జాల సమావేశం భారత దేశ కాలమానము ఏప్రిల్ 28 ఉదయం ( అమెరికా కాలమానము ఏప్రెల్ 27 వ తారీఖు సాయంత్రం) అద్భుతంగా జరిగింది.

NRI: చంద్రబాబు గెలుపు కోసం ఎన్నారైల విస్తృత ప్రచారం

ఎనిమిది దేశాల నుండి 27 వక్తలు, సంధానకర్తలతో సభ కళకళలాడింది. ఈ సభలో వంగూరి చిట్టెన్ రాజు, లలిత రామ్, వంశీ రామ రాజు, సింగపూర్ శ్రీ సాంస్కృతిక కళా సారథి అధ్యక్షులు రత్న కుమార్ కవుటూరు, రాధిక మంగిపూడి, షామీర్ జానకీ దేవి, శ్రీహవిష దాస్, తెలుగు సాహిత్య ప్రపంచంలోని అతిరథ మహారథులు పాల్గొన్నారు. మహాకవులు, రచయితలు, వాగ్గేయకారులు, వారి రచనలపై ఉత్తేజమైన ప్రసంగాలు ప్రత్యక్ష ప్రసారమయ్యాయి. కల్చరల్ టీవీ వారు ప్రసారం చేసిన ఈ సమావేశాన్ని యూట్యూబ్‌లో ఈ లింక్‌ ద్వారా వీక్షించవచ్చు.

3.jpg2.jpg

Read NRI and Telugu News

Updated Date - May 02 , 2024 | 02:44 PM