Share News

NRI: సదర్న్ న్యూ హాంప్షైర్ యూనివర్సిటీలో తానా న్యూఇంగ్లాండ్ చాప్టర్ ‘రిఫ్రెష్’ ప్రోగ్రాం

ABN , Publish Date - May 07 , 2024 | 10:00 PM

తానా న్యూ ఇంగ్లాండ్ ప్రాంతీయ ప్రతినిధి సోంపల్లి కృష్ణ ప్రసాద్.. సదర్న్ న్యూ హాంప్షైర్ యూనివర్సిటీలో కొత్తగా వస్తున్న అంతర్జాతీయ విద్యార్థుల ప్రయోజనం కోసం ప్రత్యేకంగా రూపొందించిన "తానా రిఫ్రెష్ వర్క్‌షాప్" కార్యక్రమం పూర్తి వేగంతో దూసుకుపోతోంది.

NRI: సదర్న్ న్యూ హాంప్షైర్ యూనివర్సిటీలో తానా న్యూఇంగ్లాండ్ చాప్టర్ ‘రిఫ్రెష్’ ప్రోగ్రాం

ఎన్నారై డెస్క్: తానా (TANA) అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు, ఫౌండేషన్ చైర్మన్ శశికాంత్ వల్లేపల్లి ప్రోత్సాహంతో తానా న్యూ ఇంగ్లాండ్ ప్రాంతీయ ప్రతినిధి సోంపల్లి కృష్ణ ప్రసాద్.. సదర్న్ న్యూ హాంప్షైర్ యూనివర్సిటీలో కొత్తగా వస్తున్న అంతర్జాతీయ విద్యార్థుల ప్రయోజనం కోసం ప్రత్యేకంగా రూపొందించిన "తానా రిఫ్రెష్ వర్క్‌షాప్" కార్యక్రమం పూర్తి వేగంతో దూసుకుపోతోంది.

అమెరికాలో ప్రతి రోజు హృదయాలను కలిచివేసే విద్యార్థుల విషాద సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. అనేక బాధాకరమైన సంఘటనలు జరుగుతున్నాయి. ఇక్కడ బాధాకరమయిన సంఘటనలకు హృదయం అతలాకుతలం అవుతోంది. అయితే, తానా రిఫ్రెష్ వర్క్‌షాప్ విభిన్నమైన కార్యక్రమం. ఇధి అంతర్జాతీయ విద్యార్థులపై చాలా ప్రభావం చూపుతోంది. సుమారు ఎనిమిదివేల మైళ్ళ ప్రయాణం చేసి ఇక్కడ చదవటానికి ఎన్నో కలలతోటి వచ్చే స్టూడెంట్స్, వీసా రాగానే లైఫ్ సెటిల్ అయిందనే భావం తోటి వచ్చే ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన చాలా అవసరం. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్నారనే సామెతలా కాకుండా ముందుగానే విద్యార్థులకు అమెరికా నియమాలు, నిబంధనలపై అవగాహన చాలా ముఖ్యం.

4.jpgNRI: వైసీపీ అరాచకాలపై మహిళా ఎన్నారైల సమరశంఖం


కాగా, ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ఓరియెంటేషన్ ప్రాముఖ్యత, ప్రొఫెసర్లతో ప్రవర్తన, తోటి విద్యార్థులు, వర్క్ దగ్గర జాగ్రత్తలు విశదీకరించారు. ఇక్కడ గవర్నమెంట్ ఎలా పని చేస్తుందీ, ప్రమాదం జరగ్గానే ఏమి చేయాలి, విద్యార్థుల హక్కులు వాటి ప్రాముఖ్యత, సమయం ప్రాముఖ్యత గురించి విడమర్చి చెప్పారు. హెల్త్ ప్రాబ్లమ్ వస్తే ఏమి చెయ్యాలి, ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలి అనే విషయాల గురించి చర్చించారు.

సోషల్ మీడియా ప్రపంచంలో మునిగిపోకుండా, అందరితో సామరస్యంగా ఎలా వుండాలి, ఎవరికైనా గాయమైతే మనం వెంటనే ఏమి చేయాలి, ఏదైనా చట్టపరమైన సమస్య వస్తే ఏమి చేయాలి, తల్లిదండ్రులతో క్రమం తప్పకుండా మాట్లాడుతూ ఉండాలి తదితర విషయాలు విశదీకరించి చెప్పారు.

ఈ ప్రోగ్రాంలో శశాంక్ గుట్టు, అభిషేక్ ప్రగాఢ, మహేష్ కోయలమూడి, గౌతమ్ గోరంట్ల, భరత్ రెడ్డి, చైతన్య గుడివాడ, ఆదిత్య కోడి, దినేష్ గుంటుపల్లి, హేమ శ్రీ ముద్దం మొదలగువారు పాల్గొన్నారు.

2.jpg3.jpg5.jpg

Read NRI and Telugu News

Updated Date - May 07 , 2024 | 10:09 PM