New Delhi : లాయర్లు ‘వినియోగదార్ల చట్టం’లోకి రారు
ABN , Publish Date - May 15 , 2024 | 03:26 AM
న్యాయవాదులు..వినియోగదారుల పరిరక్షణ చట్టం-1986 పరిధిలోకి రారని మంగళవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ: న్యాయవాదులు..వినియోగదారుల పరిరక్షణ చట్టం-1986 పరిధిలోకి రారని మంగళవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సరైన సేవలు అందించలేదంటూ వారిపై ఈ చట్టం కింద వినియోగదారుల ఫోరాల్లో కేసులు పెట్టలేరని తెలిపింది. న్యాయవాద వృత్తి నిరుపమానమైనదని, దాన్ని ఇతర వృత్తులతో పోల్చలేమని తెలిపింది. లాయర్లు కూడా వినియోగదారుల పరిరక్షణ చట్టం పరిధిలోకి వస్తారని, సరైన సేవలు అందించకపోతే ఫోరాలను ఆశ్రయించవచ్చని 2007లో జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ తీర్పు ఇచ్చింది. దీన్ని సవాలు చేస్తూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్, బార్ ఆఫ్ ఇండియన్ లాయర్స్ సంస్థలు సుప్రీంకోర్టులో అప్పీలు చేశాయి.