Share News

CM Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీ మధ్యంతర బెయిల్‌పై నేడు సుప్రీం తీర్పు

ABN , Publish Date - May 10 , 2024 | 10:50 AM

ఢిల్లీ లిక్కర్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్‌పై సుప్రీంకోర్టులో నేడు తీర్పు వెలువడనుంది. ఇవాళ జస్టిస్ సంజీవ్ ఖన్నా తో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరించనుంది. కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ అంశంపై ఇరు పక్షాల వాదనలు ముగిశాయి. ఎన్నికల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ అంశాన్ని పరిశీలిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.

CM Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీ మధ్యంతర బెయిల్‌పై నేడు సుప్రీం తీర్పు

ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ (CM Arvind Kejriwal) మధ్యంతర బెయిల్‌పై సుప్రీంకోర్టులో నేడు తీర్పు వెలువడనుంది. ఇవాళ జస్టిస్ సంజీవ్ ఖన్నా తో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరించనుంది. కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ అంశంపై ఇరు పక్షాల వాదనలు ముగిశాయి. ఎన్నికల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ అంశాన్ని పరిశీలిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. కేజ్రీవాల్ తరపు న్యాయవాది షరతులతోనైనా మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు. మధ్యంతర బెయిల్‌ను ఈడీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఎన్నికల ప్రచారం కోసం మధ్యంతర బెయిల్ ఇవ్వడం సరికాదంటూ నిన్న ఈడీ అఫిడవిట్ దాఖలు చేసింది.

Temples: ఆలయాల్లో గన్నేరు పూల వాడకంపై నిషేధం.. కారణం తెలిస్తే వాడి జోలికి వెళ్లరు

Updated Date - May 10 , 2024 | 10:50 AM