Share News

Sukesh Chandrasekhar: కవిత, కేజ్రీవాల్‌లకు చుక్కలు చూపిస్తున్న సుఖేష్!

ABN , Publish Date - Apr 20 , 2024 | 09:57 PM

సుఖేష్ చంద్రశేఖర్ (Sukhesh Chandra Sekhar).. ఈ పేరు వినిపించినా, మనిషి కనిపించినా.. ఇక లేఖలు బయటికొస్తే అదొక సంచలనమే! అరెస్టయిన నాటి నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి విషయాలతో వార్తల్లో నిలిచారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.! మరీ ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ కేసులో (Delhi Liquor Case) అరెస్టయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, సత్యేంద్ర జైన్‌లకు అయితే జైల్లో నుంచే సుఖేష్ చుక్కలు చూపిస్తున్నాడు!.

Sukesh Chandrasekhar: కవిత, కేజ్రీవాల్‌లకు చుక్కలు చూపిస్తున్న సుఖేష్!

సుఖేష్ చంద్రశేఖర్ (Sukhesh Chandra Sekhar).. ఈ పేరు వినిపించినా, మనిషి కనిపించినా.. ఇక లేఖలు బయటికొస్తే అదొక సంచలనమే! అరెస్టయిన నాటి నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి విషయాలతో వార్తల్లో నిలిచారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.! మరీ ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ కేసులో (Delhi Liquor Case) అరెస్టయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, సత్యేంద్ర జైన్‌లకు అయితే జైల్లో నుంచే సుఖేష్ చుక్కలు చూపిస్తున్నాడు!. ఇప్పటికే పలు లేఖలు రిలీజ్ చేసిన సుఖేష్.. తాజాగా మరో సంచలన లేఖను విడుదల చేశాడు. ఇదంతా ఆయన చేతిరాతతోనే ఉంది. లిక్కర్ కేసులో విచారణకు సంబంధించి కేంద్ర హోంశాఖ జోక్యం చేసుకోవాలని లేఖలో ఆయన పేర్కొన్నాడు. లేఖతో పాటు కవిత, సత్యేంద్ర జైన్, కేజ్రీవాల్, తనకు మధ్య జరిగిన వాట్సాప్ స్క్రీన్ షాట్లను కూడా జత చేస్తున్నట్లు సంచలనానికి తెరదీశాడు. సత్యేంద్ర జైన్ సూచనల మేరకు హైదరాబాద్‌లోని తన సిబ్బంది కవిత నుంచి సేకరించిన లావాదేవీలకు సంబంధించిన చాట్‌లు కూడా ఉన్నాయని లేఖలో పేర్కొనడంతో ఇప్పుడీ వ్యవహారం చర్చనీయాంశం అయ్యింది.


Sukhesh-Chandra-Sekhar.jpg

వదలనంటున్న సుఖేష్!

కవిత నుంచి సేకరించిన నగదును తాను ఢిల్లీ, గోవాలకు బదిలీ చేసినట్లు సుఖేష్ క్లియర్ కట్‌గా లేఖలో రాసుకొచ్చాడు. కాగా.. నెయ్యి టిన్‌గా చాట్‌లో వివరాలు కోడ్ చేయబడ్డాయని తెలిపాడు. నెయ్యి టిన్ అంటే కోటి రూపాయలకు సమానమని ఆ లేఖలో సుఖేశ్ పేర్కొన్నాడు. ఈ వ్యవహారంతా కవిత సూచనల మేరకు తనకు సంబంధించిన వ్యక్తులు హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ ఆఫీసు నుంచి చేశారని.. ఇందుకు సంబంధించిన ఆధారాలు తన దగ్గరున్నాయని సుఖేష్ తెలిపాడు. కవిత ప్రస్తుతం కస్టడీలో ఉన్నందున, ఈ లేఖకు జోడించిన ఈ చాట్‌లు పరిశీలించి విచారణ చేయొచ్చని కూడా దర్యాప్తు సంస్థలకు సూచించాడు. ఈ చాటింగ్ అంతా లిక్కర్ కేసులో కీలక పాత్ర పోషిస్తుందన్నాడు. కేజ్రీవాల్, సత్యేందర్ జైన్, మనీష్ సిసోడియా, కైలాష్ గెహ్లాట్, కవిత నేతృత్వంలోని ఆప్ సిండికేట్‌‌కు సంబంధించిన పూర్తి ఆధారాలతో అన్ని వివరాలను బహిర్గతం చేస్తానని ఒకింత చాలెంజ్‌గానే సుఖేష్ చెప్పడం గమనార్హం. అంతేకాదు తాను అన్ని విధాలుగా దర్యాప్తు సంస్థలకు సహకరిస్తానని కూడా చెప్పకనే చెప్పేశాడు. దీంతో అటు ఆప్‌కు.. ఇటు బీఆర్ఎస్‌ వర్గాల్లో అలజడి మొదలైందని తెలుస్తోంది. సుఖేష్.. మున్ముందు ఇంకెన్ని సంచలనాలకు తెరదీస్తారో అని ఈ కేసులోని పాత్రదారులు, సూత్రదారులు భయపడిపోతున్న పరిస్థితి.

Kavitha-cousterdy.jpg

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 20 , 2024 | 10:03 PM