Share News

Teachers Fighting: స్కూల్లో టీచర్, ప్రిన్సిపల్ డిష్యూం.. డిష్యూం

ABN , Publish Date - May 04 , 2024 | 01:30 PM

ప్రాధమిక పాఠశాలలో విద్యార్థులు ఒకరినొకరు కొట్టుకున్నారంటే.. చిన్న పిల్లలన్న తర్వాత ఇదంతా సహజమని ఎవరైనా అంటారు. కానీ ఆ విద్యార్థులకే పాఠాలు చెప్పే టీచర్, ఆ పాఠశాల ప్రిన్సిపల్ ఒకరినొకరు కొట్టుకుంటే.. దీనినే మనాలి.

Teachers Fighting: స్కూల్లో టీచర్, ప్రిన్సిపల్ డిష్యూం.. డిష్యూం

ప్రాధమిక పాఠశాలలో విద్యార్థులు ఒకరినొకరు కొట్టుకున్నారంటే.. చిన్న పిల్లలన్న తర్వాత ఇదంతా సహజమని ఎవరైనా అంటారు. కానీ ఆ విద్యార్థులకే పాఠాలు చెప్పే టీచర్, ఆ పాఠశాల ప్రిన్సిపల్ ఒకరినొకరు కొట్టుకుంటే.. దీనినే మనాలి. అటువంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లోని అగ్రాలో శుక్రవారం అంటే.. మే 3వ తేదీన చోటు చేసుకుంది. టీచర్ గుంజ చౌదరి.. పాఠాశాలకు ఆలస్యంగా వచ్చింది.

AP Elections: తాడేపల్లి 'కొంప' ముంచిందా.. భయంతో బతుకుతున్న జగన్..!


Chennai: ఇక భగభగలే.. నేటినుంచి అగ్నినక్షత్రం ప్రారంభం

ఎందుకు ఆలస్యమైందంటూ ఆమెను ప్రిన్సిపల్ ప్రశ్నించారు. ఆ క్రమంలో ప్రిన్సిపల్‌గారు కూడా గత నాలుగు రోజులుగా పాఠశాలకు ఆలస్యంగా వస్తున్నారంటూ సదరు టీచర్ వ్యంగ్యంగా సమాధానమిచ్చారు. దీంతో అటు టీచర్, ఇటు ప్రిన్సిపల్ మధ్య మాట మాటా పెరిగి.. మాటల యుద్దంగా మారింది.


AP Elections: ఈ ఐదేళ్లలో ఏం చేశారో చెప్పే ధైర్యం ఉందా?..వైసీపీ నేతలను ప్రశ్నించిన సుజనా

వారిద్దరు అక్కడితో ఆగకుండా.. ఇద్దరు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. అయితే అక్కడే ఉన్న తోటి టీచర్లు వారిద్దరిని.. వారించి.. విడదీసేందుకు ప్రయత్నించారు. అందుకు సంబంధించిన వీడియో.. సోషల్‌లో పోస్ట్ చేశారు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. పాఠశాల టీచర్, ప్రిన్సిపల్ ఘర్షణపై నెటిజన్లు సైతం తమదైన శైలిలో కామెంట్ చేస్తున్నారు. మరోవైపు వీరిద్దరు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కి.. ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. దీంతో పోలీసులు సాధారణ కేసు నమోదు చేశారు.

For Latest News and National News click here

Updated Date - May 04 , 2024 | 01:32 PM