Share News

Chennai: ఇక భగభగలే.. నేటినుంచి అగ్నినక్షత్రం ప్రారంభం

ABN , Publish Date - May 04 , 2024 | 12:27 PM

ఇప్పటికే అధికమైన ఎండవేడితో అల్లాడిపోతున్న రాష్ట్ర ప్రజానీకానికి మరో హాట్‌ న్యూస్‌. శనివారం అగ్నినక్షత్రం ప్రారంభం కానుంది. శనివారం నుండి మూడు రోజులపాటు పగటిపూట ఉష్ణోగ్రత(Temperature)లు అత్యధికంగా ఉంటాయని ప్రకటించిన వాతావరణ కేంద్రం.. 17 జిల్లాలకు ‘ఆరంజ్‌ అలెర్ట్‌’ జారీ చేసింది. ఫిబ్రవరి నెలాఖరు నుంచే రాష్ట్రంలో ఎండలు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్‌లో పగటి పూట ఉష్ణోగ్రతలు అధికమయ్యాయి.

Chennai: ఇక భగభగలే.. నేటినుంచి అగ్నినక్షత్రం ప్రారంభం

- 17 జిల్లాలకు ఆరంజ్‌ అలెర్ట్‌

- మూడు రోజులు వడగాడ్పులు

చెన్నై: ఇప్పటికే అధికమైన ఎండవేడితో అల్లాడిపోతున్న రాష్ట్ర ప్రజానీకానికి మరో హాట్‌ న్యూస్‌. శనివారం అగ్నినక్షత్రం ప్రారంభం కానుంది. శనివారం నుండి మూడు రోజులపాటు పగటిపూట ఉష్ణోగ్రత(Temperature)లు అత్యధికంగా ఉంటాయని ప్రకటించిన వాతావరణ కేంద్రం.. 17 జిల్లాలకు ‘ఆరంజ్‌ అలెర్ట్‌’ జారీ చేసింది. ఫిబ్రవరి నెలాఖరు నుంచే రాష్ట్రంలో ఎండలు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్‌లో పగటి పూట ఉష్ణోగ్రతలు అధికమయ్యాయి. ఎండవేడి భరించలేక చిన్నారులు, వృద్ధులు ఇంటి పట్టునే గడుపుతున్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో శనివారం ‘అగ్నినక్షత్రం’ ప్రారంభమవుతోంది. ప్రతియేటా అగ్ని నక్షత్రం ఎండలు 25 రోజులపాటు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. ఆ మేరకు శనివారం ప్రారంభమయ్యే అగ్నినక్షత్రం ఈ నెల 28 వరకు ఉంటుంది.

ఇదికూడా చదవండి: Hyderabad: ఒక్క ఛాన్స్ అంటూ వచ్చి.. నిర్మాత ఒంటిపైనున్నవన్నీ దోచేశాడు..

అగ్నినక్షత్రం ప్రారంభం కాకమునుపే రాష్ట్రంలో పగటిపూట ఉష్ణోగ్రత 37.7 డిగ్రీలు దాటుతున్నాయి. రాష్ట్రంలో గురువారం 18 జిల్లాల్లో పగటిపూట ఉష్ణోగ్రత 37.7 డిగ్రీలుగా నమోదైంది. అధికంగా కరూరులో 44.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈరోడ్‌లో 43.8 డిగ్రీలు, వేలూరులో 43.3 డిగ్రీలు, నుంగంబాక్కంలో 37.7 డిగ్రీల సెల్సియ్‌స నమోదైంది. గత యేడాది అగ్నినక్షతం తీవ్రంగా ఉన్నప్పుడు మే 17న 42.4 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదైంది. ఈ పరిస్థితుల్లో ఈ యేడాది అగ్నినక్షత్రం ఎండల తీవ్రత అధికంగా ఉంటుందనే ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే దక్షిణాది జిల్లాలు, పడమటి కనుమల ప్రాంతాల్లో అడపదడపా తేలిక పాటి వర్షాలు కురుస్తున్నాయి. కనుక అగ్నినక్షత్రం ఉన్న రోజుల్లోనే చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు శనివారం నుంచి ఆరో తేదీ వరకు 17 జిల్లాల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే 5 డిగ్రీలు అధికంగా నమోదవుతాయని వెల్లడించి ఆ జిల్లాలకు ఆరంజ్‌ అలెర్ట్‌ హెచ్చరికలు జారీ చేసారు. ఆ మేరకు తిరుచ్చి, తిరుప్పూరు, తిరువారూరు(Tiruchi, Tiruppur, Tiruvarur), తంజావూరు, నాగపట్టినం, వేలూరు, రాణిపేట జిల్లాలు సహా 17 జిల్లాల్లో మూడు రోజులపాటు ఎండలు విపరీతంగా కాస్తాయని తెలిపారు.

ఇదికూడా చదవండి: Hyderabad: దూసుకుపోతున్న ‘మెట్రో’.. రికార్డుసాయిలో ప్రయాణికులు

వర్షసూచన...

ఉపరితల ఆవర్తనం, పడమటి దిశ గాలుల్లో మార్పుల కారణంగా ఈ నెల 8 వరకు రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ పరిశోధన కేంద్రం ప్రకటించింది. నగరంలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, శని, ఆదివారాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పుదుచ్చేరి, కారైక్కాల్‌ ప్రాంతాల్లోనూ వర్షం కురుస్తుందని ఆ ప్రకటనలో తెలిపారు. ఏది ఏమైనప్పటికీ అకాల వర్షంగా కురిసే తేలికపాటి వర్షాలకు పగటి పూట ఉష్ణోగ్రతలో మార్పులు ఉండవని, కనుక అగ్నినక్షత్రం ఎండల్లో చిన్నారులు, వృద్ధులు ఇంటిపట్టునే గడపటం మంచిదని సూచించారు.

ఇదికూడా చదవండి: Lok Sabha Polls: రాహుల్ వారసత్వాన్ని నిలబెట్టుకుంటారా..!

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - May 04 , 2024 | 12:27 PM